`తన గోతిని తాను తవ్వుకున్న కాంగ్రెస్?
`2జి స్కాం జరక్కపోయినా లేని పోని రాద్ధాంతం చేసిందే కాంగ్రెస్?
`మిత్ర పక్షాన్ని ఇరికించి రాజకియం చేయాలనుకున్నది?
`తన గోతిని తానే తీసుకున్నది?
`ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది?
`చేయని తప్పుకు డి ఎం కే ను ఇరికించి తప్పించుకోవాలనుకున్నది?
`డిఎంకె ను రాజకీయంగా బలిపశువును చేసింది?
`కర్మ తిరగబడితే దేశమంతా కాంగ్రెస్ నామారూపాలు లేకుండా పోయింది?
`కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు?
`బీహార్ లో లాలును ముంచారు?
`గడ్డి స్కామ్ పేరుచెప్పి దూరం చేసుకున్నారు?
`శరద్ పవార్ లాంటి నాయకుడిని దూరం చేసుకున్నారు?
`మమత బెనర్జీ లాంటి నాయకురాలు శక్తి ని తక్కువగా అంచనా వేశారు.
`ఆఖరుకు బి ఆర్ ఎస్ విలీనం లో కూడా దిక్కుమాలిన రాజకీయం చూపారు?
`వైస్ జగన్ విషయంలో కక్ష సాధింపు చర్యలు చేశారు.
`నమ్మిన పార్టీలను నట్టేట ముంచింది?
`నమ్మిన నాయకులను బలహీన పర్చూతూ వచ్చారు?
`నమ్మక ద్రోహుల మాటలు వింటూ వచ్చారు.
`ఇప్పటికి అదే దారిలో నడుస్తున్నారు.
`కాలానికి అనుగుణంగా రాజకీయాలు చేయలేక పోతున్నారు.
`జనం నాడిని అంచనా వేయలేకపోతున్నారు.
`ప్రతిసారి బొక్క బోర్లా పడుతున్నారు.
`గెలవడం చేత కాక గిల గిల కొట్టుకుంటున్నారు.
`రాజ్యాంగ వ్యవస్థలను అవమాన పరుస్తున్నారు.
`అన్ని వ్యవస్థలకు, వర్గాలకు దూరమై పోతున్నారు.
`కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా పగటి కలల్లోనే రాజకీయం చేస్తున్నారు.
`ఇప్పుడు రాజకీయ శిక్ష అనుభవిస్తున్నారు?
`లేని అవినీతి పేరుచెప్పి కేజ్రీ వాల్ వచ్చాడు?
`అదే అవినీతికి బాలయ్యాడు?
`అన్నా హాజరే అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు?
`బీజేపీ ని నమ్మి కాంగ్రెస్ ను నిండా ముంచాడు?
`అప్పుడు కనీసం అన్నా హాజరే అనే పేరు వినిపించేది?
`చెజేతులా తన పేరు ప్రతిష్టలను తానే చేరిపేసుకున్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్దితికి కారణం ఎవరో కాదు! ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, అధినేతలే కారణం. రాజకీయాలలో మూస దోరణులు అనుసరిస్తూ గత మూడు దశాబ్దాలుగా ముందుకు సాగడమే అసలు వైఫల్యం. ప్రపంచీకరణతోపాటు, ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన రాజకీయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే నానుడిని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. ఈ విధానమే తప్ప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేసేలా చేస్తోంది. గతం వేరు. వర్తమానం వేరు. భవిష్యత్తును అంచనా వేసుకోలేని రాజకీయాలు వధా! అందుకే గతం తాలుకు వైఫల్యాలను ఇంకా వెంటేసుకొని కాంగ్రెస్ వర్తమానంలో కూడా అడుగులు వేస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు పరుగులు పెడుతోంది. ముందు వెళ్లాల్సిన పరుగు, వెనక్కి వెళ్తోంది. తరం మారుతున్నప్ప్పుడు యువతలో వచ్చే మార్పులకు అనుగుణంగా పార్టీలు మలుపులు తిరగాలి. అంతే కాని రాజకీయ పార్టీలు ఎంచుకున్న దారిలో ప్రజలు నడవాలని కోరుకోవడం సరైంది కాదు. జనం ఆలోచనలు పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోతోందన్నది ఇంకా అర్ధం చేసుకోవడంలేదు. అలా అని బిజేపి వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా పూర్తిగా విఫలం చెందుతోంది. నిజం చెప్పాలంటే ఈ పన్నెండేళ్ల బిజేపి పాలనలో వ్యవస్ధలన్నీ కుంటుపడుతున్నాయి. అయినా జనం బిజేపిని ఆదరిస్తున్నారు. నాయకులు అనుసరిస్తున్నారు. కొత్త తరం బిజేపిని అక్కను చేర్చుకుంటున్నారు. అందుకు ప్రజల ఆలోచనలను బిజేపి అనుసరిస్తోంది. జనం ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా అడుగులేస్తోంది. బిజేపి వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని రాజపకీయం చేస్తుందని కాంగ్రెస్ చెప్పడంలో అర్ధం లేదు. దేశ ప్రజలు కాంగ్రెస్‌పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అవకాశాలిచ్చారు. మరే పార్టీకి ఇవ్వనంత సమయం ఇచ్చారు. ఎమర్జెన్సీ లాంటి పరిస్దితులను సష్టించినా జనం కాంగ్రెస్ వైపే నిలిచారు. అయినా కాంగ్రెస్ పార్టీ జనాన్ని అర్దం చేసుకోవడం మానేసింది. మూస రాజకీయాలు చేయడం మాత్రమే నేర్చుకున్నది. ఎమర్జెన్సీ తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడమే అందుకు ఆ పార్టీకి శాపంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎమర్జెన్సీకి ముందు రాజకీయాలే ప్రజలు ఆదరిస్తున్నారన్న భ్రమల్లోనే కాంగ్రెస్‌పార్టీ రాజకీయాలు చేస్తూవచ్చింది. ఇప్ప్పుడు బొక్కా బోర్లాపడింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దని ఇప్పటికీ అనుకోవడం లేదు. బిజేపి ఎంత ముక్త్ కాంగ్రెస్ అని ప్రకటనలు చేసినా జనం ఎంతో కొంత కాంగ్రెస్‌కు అండగా నిలుస్తూనేవున్నారు. అయినా కాంగ్రెస్‌లో మార్పు రావడం లేదు. తర్వాత కాలంలో ఆ పార్టీ అనుసిరంచిన మూస విధానల మూలంగా నిండా మునిగిపోయింది. ఇప్ప్పుడు తేరుకోవడానికి తంటాలు పడుతోంది. అయినా ప్రజలు సానుభూతిని చూపించడం లేదు. ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా, వ్యవస్ధ పరంగా కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయినా బిజేపిని వద్దనుకోవడం లేదు. దేశంలో పన్నులు పెరిగాయి. ధరలు పెరిగాయి. ఉపాధి తగ్గింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. విద్య, వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతోంది. చదువుకొనాలన్నా, వైద్యం చేసుకోవాలన్నా ఆస్ధులు అమ్ముకునే పరిస్ధితులు దాపురిస్తున్నాయి. అయినా ప్రజలు బిజేపి వైపే నిలుస్తున్నారు. కారణం అవినీతి రహిత పాలన అనేది బిజేపికి రక్షణ కవచడంగా మారిపోయంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి అంటే పాలకులు చేసే అవినీతి మాత్రమే కనిపించేది. రాజీవ్ గాంధీ విషయంలో బోఫోర్స్ దేశరాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నాయకులు, పాలకులతోపాటు, ఆ పార్టీకి నమ్మకంగా మద్దతు తెలిపిన పార్టీలను సైతం కాంగ్రెస్ పార్టీ అవినీతి చట్రంలో ఇరికించుకుంటూ పోయింది. దాంతో దేశంలో వున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను నమ్మడం మర్చిపోయాయి. కాంగ్రెస్‌తో స్నేహం చేయడం వల్లనే ఆయా పార్టీలకు పుట్టగతులు లేకుండాపోయాయి. ఒకప్ప్పుడు బిహార్ అంటే లాలూ అనేవారు. అలాంటి బిహార్‌ను ఏకచత్రాదిపత్యంగా ఏలుతున్న లాలూకు అవినీతి మరకలు అంటించారు. ఆయనను జైలు పాలు చేశారు. ప్రజల్లో లాలూ నాయకత్వాన్ని పలుచన చేశారు. తద్వారా కాంగ్రెస్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నది. లాలూ లాంటి లౌకిక వాదిని గడ్డి కుంభకోణంలో ఇరికించి, ఆయన ప్రస్తానాన్ని అడ్డుకున్నది. నితీష్ వెలుగులోకి వచ్చారు. ఇప్పటికీ రెండు దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నాడు. అయినా ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వున్నా, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. కారణం ఆయనను బిజేపి రక్షణ కవచంగా చూసుకుంటోంది. నితీష్ రాజకీయంగా బలమైన నాయకుడు. ఆయనను అనవసరంగా కెలికి రాజకీయంగా శుప్తావస్తకు #రుకోవడం కన్నా, కలిసి సాగడమే మేలని బిజేపి కదులుతోంది. ఇదీ బిజేపి అసలు రాజకీయం. దక్షిణాదిలో తమిళనాడు నుంచి కాంగ్రెస్‌కు ఆది నుంచి డిఎంకే మద్దతిస్తూ వుంది. కాని ఆ డిఎంకే నేతలు కనిమొలి, రాజాలను టుజి స్ప్రెక్ట్రమ్ స్కామ్‌లో తొంరపడి ఇరికించారు. తమిళనాడులో డిఎంకేను పరోక్షంగా దెబ్బకొట్టారు. దాంతో తన గోతిని తానే కాంగ్రెస్ తవ్వుకున్నది. ఇలా కాంగ్రెస్‌కు అండగా వున్న నాయకులను, పార్టీలను బలపశువులను చేస్తూ పోయింది. మహారాష్ట్రలో బలంగా వున్న పూర్వపు కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ రాజకీయాన్ని తుంచేదసింది. మహారాష్ట్రలో స్వయంకతాపరాధంతో కాంగ్రెస్‌కు నీడ లేకుండా చేసుకున్నది. ఇలా శరద్‌యాదవ్ లాంటి నాయకుడిని కూడా దూరం చేసుకున్నది. పశ్చిమబెంగాల్ సిఎం. మమతా బెనర్సీని కట్టడి చేసి, ఆమెకు రాజకీయం లేకుండా చేయాలనుకున్నారు. ఆమె ఏకంగా ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయి, బెంగాల్‌ను పాలిస్తోంది. పార్టీని నమ్ముకొని వున్న నాయకులకు, పార్టీలకు పొగబెట్టి, పనికిరాని నాయకుల మాటలు విని సోనియాగాందీ పార్టీని నిండా ముంచేసిందని చెప్పడంలో సందేహమే లేదు. చెరపకురా చెడేవు అనే సామెతను నిజం చేసుకున్న వారిలో డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. అవినీతి మచ్చలేని అదికారిగా ఆయనకు 2013 వరకు పేరుంది. ఆ పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. జనం మెచ్చారు. ఆదరించారు. డిల్లీ ముఖ్యమంత్రిని చేశారు. ఆఖరుకు ఆయన కూడా అవినీతి పరుడనే ముద్రను తగిలించుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వరుసగా మూడుసార్లు విజయం సాదిండచంతో ఆయన ఇక తాను ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అనుకున్నారు. పార్టీని విస్తరించి, దేశ రాజకీయాలను ఏలాలనుకున్నారు. రాజకీయంగా పార్టీ విస్తరించడం అనేది గొప్ప విషయమే. ఆ విస్తరణ ప్రజా విస్తరణలా వుండాలే కాని, సామ్రాజ్య విస్తరణలా వుండకూడదని తెలుసుకోలేకపోయారు. దాదాపు దక్షిణాదికి చేరువయ్యే క్రమంలో తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారు. గుజరాత్‌లో కూడా సీట్లు గెల్చుకున్నారు. ఉత్తరాదిలో ఊపేయాలనుకున్నారు. తన చీపురుతో అవినీతిని పార్టీలను ఊడ్చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకున్నారు. ఒక్కసారి అవినీతి మరకలు అంటుకున్న తర్వాత వాటిని కడుక్కోవడం చాలా క ష్టం. కాలం మారుతున్నా ఆ మరక చెరిపేసుకోవడం ఈ రోజుల్లో సాద్యం కాదు. పదేళ్ల క్రితం చేసిన తప్ప్పులు కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై వుంటాయి. ఎప్పటికప్ప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అందుకే బిజేపి అనేది అవినీతి మరÅ£లు అంటించుకోకుండా సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ బిజేపిని నిందించాలంటే అదాని, ఆదాని అంటారే గాని, ఏ ఒక్క మంత్రికి అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు. ఇదీ బిజేపి సాగిస్తున్న ఆసక్తికరమైన రాజకీయం. అవినీతిపై యద్దం మొదలుపెట్టి దీక్షలు, నిరసనలు చేసి దేశమంతా ఒక్కటి చేసిన, అన్నా హజారే లాంటి వారు అడ్రస్ లేకుండాపోయారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే అవినీతి అంతమౌతుందనుకున్నాడు. కాని బిజేపి గెలిస్తే కనీసం ప్రశ్న కూడా వినపడని రాజకీయాలు వస్తాయని ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రశ్నించేందుకు అవకాశం వుండేది. ఇప్ప్పుడు ఆ ప్రశ్నకు కూడా అవకాశం లేకుండాపోయింది. ఇలా కొంత మంది నాయకులు, పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేసుకున్న స్వయంకతాపరాథమే మొదటికే మోసం తెచ్చింది. తేరుకోకుండా చేసుకున్నది.
