రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం.
#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
