చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
నిజాంపేట: నేటి ధాత్రి
చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ తిరుమల నాథ స్వామి ఆలయం లో మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చల్మెడ గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం, బండ్ల ఊరేగింపు, రథం తిరుగుట, పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు బుధవారం చక్రస్నానంతో ముగింపు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ.. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరిపై స్వామి వారి దయ, కృప, కటాక్షాలు ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవిస్తారన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, కాకి రాజయ్య ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
