· రాజధాని కొలిక్కిరావడానికి పుష్కరకాలమా?
· ఛత్తిస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్‌ల అభివద్ధిని గమనించారా?
· ఏర్పడిన రెండు దశాబ్దాల్లో అద్భుతమైన ప్రగతి
· రాజధానిపై నిర్ణయానికి పన్నెండేళ్లు కావాలా?
· రాజకీయ విభేదాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం అన్యాయం
· అమరావతి నిర్ణయంలో ఔచిత్యమెంత?
· అమరావతి భూములతో 2.5కోట్ల మందికి ఆహారభద్రత
· 50వేల ఎకరాలపై రైతులకు రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభం
· ఈ స్థాయి దిగుబడినిచ్చే భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగలదా?
· రియల్ ఎస్టేట్ ఏ భూముల్లోనైనా చేయవచ్చు
· అన్నపూర్ణ వంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం అన్యాయం
· రోటీ, కపడా ఔర్ మకాన్ తర్వాతనే ఏదైనా
· వెనుకబడిన రాష్ట్రాల అభివద్ధి తీరు ఆదర్శం కావాలి
· ఆకాశానికి నిచ్చెనలు వద్దు
· ప్రభుత్వం వాస్తవాన్ని విశ్లేషించుకోవాలి
· రాజకీయం కాదు, రాష్ట్రహితం ముఖ్యం
హైదరాబాద్, నేటిధాత్రి:
పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించడం తాజా పరిణామం. రాష్ట్రానికి కేంద్ర స్థానంలో వుండి అన్ని ప్రాంతాలకు అందుబాటు లో వుండే అమరావతి చట్టబద్ధ రాజధానిగా రూపొందటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఆనందం కలిగించవచ్చు. రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని సమస్య అధికారపార్టీకి అనుగుణంగా మారిపోతుండటం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పుష్కరాలం గడిచినా ఇప్పటివరకు రాజధాని సమస్య ఒక కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కార ణం. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల మధ్య రాజధానిపై ఏకాబిప్రాయం లేదు. తెలుగుదేశం అమరావతి కేంద్రీకత రాజధాని కావాలని కోరుతుండగా, వైఎస్సార్సీపీ మాత్రం వికేంద్రీకత అభివద్ధి రాష్ట్రానికి అవసరమంటూ, విశాఖ (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) నగరాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నిజం చెప్పాలంటే మొదటినుంచి మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రాజ ధాని విషయంలో ఏకాభిప్రాయం లేదన్న మాట వాస్తవం. అనేక తర్జనభర్జనల తర్వాత వాదోపపవాదాలు, మీడియా విశ్లేషణలు, కమిటీల నివేదికల నేపథ్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రతి దానికి సానుకూలత, ప్రతికూలతలు తప్పనిసరిగా వుంటాయి. దురదష్టవశాత్తు తెలుగుదేశం, వైసీపీలు ఒకరు చెప్పినదా న్ని మరొకరు ఆమోదించకపోవడం, ప్రభుత్వాలు మారడంతో రాజ ధాని విషయం ఎటూ తేల కుండానే పుష్కరకాలం దాటిపోయింది. ఇందుకు ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల వైఖరులనే నిందించాలి. రాజకీయ విభేదాలున్నా, రాష్ట్ర విశాలహితం కోసం అవి కలిసి పనిచేయడం వాటి విద్యుక్త ధర్మం. దురదష్టవశాత్తు దీన్ని ఈ రెండు పార్టీలు విస్మరించాయి. దీనివల్ల మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.
ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2000, నవంబర్ 1న ఏర్పాటైంది. తక్షణమే తా త్కాలిక రాజధానిగా రాయ్‌పూర్ పనిచేయడం ప్రారంభమైంది. తర్వాత 10`15 సంవత్సరాల కాలంలో నయా రాయ్‌పూర్ (అటల్‌నగర్) ప్రణాళికాబద్ధ నగరంగా రూపొంది మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాయి. పరిపాలన, ప్రజాసౌకర్యాలు ఏర్పాటు కావడమే కాదు, 2020 నాటికి ఈ సదుపాయాలు మరింత విస్తరించాయి కూడా! అదేవిధంగా 2000, నవంబర్ 15న ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. తక్షణమే రాజధానిలో రాజధాని కార్యక్రమాలు మొదలయ్యాయి.అసెంబ్లీభనవాలు, హైకోర్టు, సమగ్ర పట్టణీకరణ వంటివి 15`20 ఏళ్లలో పూర్తయ్యాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా 2000, నవంబర్ 9న ఏర్పాటైంది. తర్వాత మూడు నుంచి పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. 2020 నాటికి రాష్ట్రం సుస్థిరమైన వద్ధిని నమోదు చేసింది. ఉత్తరాఖండ్ పర్వతాలతో నిండిన ప్రాంతం కావడంతో 2003లో కేంద్రం అందించిన సహకారంతో హరిద్వార్, సంత్‌నగర్, సెలాకి, సితార్‌గంజ్‌లను ప్రధాన పారిశ్రామిక పట్టణాలు గా అభివద్ధి చేసింది. 2000`19 మధ్య కాలంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య 12 రెట్లు భా రీగా పెరిగింది. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలను పరిశీలిస్తే రెండు దశాబ్దాల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించడం మన కళ్లముందు కనిపిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏమైంది? 12 సంవత్సరాలు పూర్తికావస్తున్నా ఇంకా రాజధాని నిర్ణయం రాజకీయాల మధ్య కొరుకుడు పడని సమస్యగా మిగిలిపోవడం ప్రజల దౌర్భాగ్యం.
చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానంలో పెద్ద లోపమేంటంటే ఒకేసారి లక్షకోట్లు పెట్టుబడి పెట్టి రాజధానిని ఏకంగా సింగపూర్ తరహాలో అభివద్ధి చేయాలన్న ఆచరణ సాధ్యంకాని సంకల్పాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఒకేసారి లక్షకోట్లు సమీకరణ సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే రాష్ట్రం అప్పులు రూ.పదిలక్షల కోట్లు దాటిపోయింది. దీనికి తోడు అధికారం కోసం ఉచితాలను ఎడాపెడా ప్రకటించడంతో వాటికి నిధులు లేక, అమలు సాధ్యం కాక చేతులెత్తేసే పరి స్థితి! ఈ వైఫల్యాలను విపక్ష వైసీపీ క్యాష్ చేసుకొని ప్రజల్లోకి ప్రచారానికి వెళుతోంది. ఇది సహజం. మరి వచ్చేసారి తమ ప్రభుత్వమే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ వైస్ జగన్‌కూ వుండదు. అందువల్ల వీరిద్దరిమధ్య అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు అహంకారానికి పోకుండా రాష్ట్ర హితం కోసం రాజధానిపై ఒకే తాటిపై నిలబడాలి. ఇప్పుడు వైసీపీ కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నది కనుక, ఇరు పార్టీలు ఉమ్మడిగా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన అభివద్ధిపై దష్టి పెట్టాలి. మీరు ఓకే అన్నప్పుడు మాత్రమే కేంద్రం నుంచి సహాయం అందుతుంది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివద్ధి చెందిన రాష్ట్రం. ఆ మూడు రాష్ట్రాలు ఏర్పాటైన రెండు దశాబ్దాల కాలంలో సాధించిన పురోగతిని దష్టిలో పెట్టుకోవాలి. పూర్తి పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం రూ.22లక్షల కోట్లతో రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయా లు అభివద్ధి చెందుతున్నాయి. నిజానికి నయారాయ్‌పూర్ విస్తీర్ణం 8వేల నుంచి 20వేల ఎకరా లు. ఝా ర్ఖండ్ రాజధాని రాంచీని స్మార్ట్ సిటీపేరుతో 65`657 ఎకరాలో అభివద్ధి చేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్ కాగా వేసవి రాజధాని గైర్‌సైన్. డెహ్రాడూన్ విస్తీర్ణం 74,131 ఎకరాలు. అదే గైర్‌సన్ తహసీల్ ప్రాంత విస్తీర్ణం 501 చదరపు కిలోమీటర్లు. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు వాటికి అందుబాటులో వున్న భూభాగాల్లో, అనువైన విస్తీర్ణంలో కొత్త రాజధానులను ని ర్మించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతం భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో వున్నప్పటికీ ఆర్థిక, పర్యావరణ పరంగా ఇక్కడ కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. అదీకాకుండా మిగిలిన మూడు కొత్త రా ష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి అత్యంత సారవంతమైంది. రాష్ట్రాన్నిఅన్నపూర్ణగా మలుస్తున్న సుక్షేత్రమైన కష్ణా పరీవాహక ప్రాంతం. ప్రభుత్వం మొత్తం 50వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 2015లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 34385 ఎకరాలను తెలుగుదేశం ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 16వేల నుంచి 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో సగటున ఎకరాకు 2వేల నుంచి 2800 కిలోల వరకు దిగుబడి వుంటుంది. అంటే ఒక ఎకరాకు సగటున 2.5టన్నుల వరి దిగుబడి వస్తుందని భావిస్తే 50వేల ఎకరాల్లో మొత్తం దిగుబడి 125వేల టన్నులు (1.25లక్షల మెట్రిక్ టన్నుల) అవుతుంది. ఈ 125 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో 2.49కోట్ల మంది ప్రజలకు నెలరోజుల పాటు ఆహారం లభిస్తుంది. అమరావతిలో ఖరీఫ్, రబీ పంటలు పండిస్తారు కనుక వార్షికంగా ఈ దిగుబడి చాలా అధికం. ఇప్పుడు ప్రభుత్వం సేకరించే 50వేల ఎకరాల్లో 42వేల ఎకరాలు సాగుభూమి. వీటిల్లో 36వేల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం వుంది. అంతేకాకుండా ఇవి వర్షాకాలంలో వరదలకు గురవుతుంటాయి. అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో పత్తి, పప్పుధాన్యాలు, మొక్క్పు£న్న, చెరకు, అరటి, మామిడి వంటి పంటలను కూడా సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో రైతులు బంతి వంటి పువ్వులతో పాటు వందరకాల పంటలు పండిస్తారు. ఇవి రైతులకు ఎంతో రాబడినిస్తాయి. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతుకు ఎకరానికి రూ.33వేల నుంచి రూ.51,200 వరకు లాభం వుంటుంది. అంటే 50వేల ఎకరాలకు కలిపి రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభాన్ని రైతులు పొందుతున్నారు. ఇక మిర్చి, మిగిలిన ఉద్యానవన పంటల ద్వారా రైతులకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది.
పై గణాంకాలను పరిశీలిస్తే రాజధాని నగరానికి ఇంతటి సుక్షేత్రమైన సాగుభూమిని సేకరించ డం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. రాజధాని నిర్మాణమంటే భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వస్తాయి. వీటిని మరే ఇతర సాగుపరంగా తక్కువ ప్రా ధాన్యత కలిగిన భూముల్లో కల్పించవచ్చు. ఏ భూమి సేకరించినా అక్కడ మౌలిక సదుపాయాలుకల్పించాల్సిందే. ఈ ఖర్చులో ఎక్కడా తేడారాదు. కానీ కోట్లమంది ప్రజలకు ఆహారాన్ని అందిం చే ప్రాంతాన్ని కాంగ్రీట్ జంగిల్‌గా మార్చడం ఎంతవరకు సబబు? రాబోయే కాలంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో సాగునీటి వసతిలేని భూములు 36% వరకు వుండగా 63.9% భూములకు నీటి సదుపాయం వుంది.స్థూల నీటిపారుదల విస్తీర్ణం 6.28 మిలియన్ హెక్టార్లు కాగా, వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అధికం. ఇక రాయలసీమ ప్రాంతంలో కేవలం 8.87% భూములు మాత్రమే న మ్మదగ్గ నీటిపారుదల సౌకర్యాన్ని కలిగివున్నాయి. 41% నుంచి 49% వరకు భూగర్భ జలాలపైఆధారపడి వ్యవసాయం కొనసాగుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ నీటివసతి పుష్కలంగా వుండి, అన్నపూర్ణగా వున్న ఈ ప్రాంతాన్ని రాజధాని పేరుతో కాంక్రీట్ జంగిల్‌గా మా ర్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటనేది అర్థం కాదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని కోట్లమందికి ఆ హారభద్రత సమస్య ఏర్పడుతుంది. ప్రజాహితం కోరే ఏ ప్రభుత్వమైనా, ఇటువంటి కార్యక్రమాలను తక్కువ నీటి వనరున్న ప్రాంతాల్లో చేపట్టడం సహజం. దీనివల్ల ఆ ప్రాంతాలకు కొన్ని సదు పాయాలు అందుబాటులోకి రావడమే కాదు, ప్రభుత్వ చర్యలవల్ల అక్కడ నీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశ ముంటుంది. అటువంటి వెనుకబడిన ప్రాంతాలు అభివద్ధి చెందుతాయి కూడా. కేవలం రాజకీయ ప్రయోజనం, రియల్ ఎస్టేట్ సంపాదన కోసం లేదా కొందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ లాభాల మాట అట్లావుంచి భవిష్యత్తులో ఆహారభద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశాలే ఎక్కువ. పోనీ ఇక్కడ సేకరించిన భూమి విస్తీర్ణంలో మరే ఇతర ప్రాంతంలోనైనా ఇంతటి సారవంతమైన భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగýదా? ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నదులు, సెýయేర్లు ఇతర నీటి వనరులు ప్రకతి ప్రసాదితాలు. కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలను పరిశీలి స్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని నిర్ణయించడంలోనే పుష్కరకాలం జాప్యం చేసి ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు తప్పుడు నిర్ణయంతో సారవంతమైన భూములను నిరుపయోగం చే యడమే కాదు, ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగిస్తోంది.
