పాఠశాలలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో మంగల్గి బక్కారెడ్డి (40) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన బక్కారెడ్డి, సోమవారం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతికారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక మామిడి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆస్తులు లేకపోవడం, పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతని అన్న జగన్నాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
