సేవాలాల్ మహారాజ్ ఆలయానికి భజన మండలి ప్రయాణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు చున్నం బట్టి తండా భజన మండలి పోరదేవి మరియు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళుతున్నారు. మొగుడంపల్లి మండలం నుంచి సేవాలాల్ మహారాజ్ పోరఘడ్ కి ప్రయాణ యాత్రలో బీ లచ్చిరామ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్, డైరెక్టర్, చున్నం భట్టి తండా, జహీరాబాద్ నియోజకవర్గ నాయకుడు కూడా ఉన్నారు. శ్రావణమాసంలో శ్రీ ఎల్లమ్మ మాత భజన మండలితో నెల ముగిసింది. 9 రోజుల్లో గణపతి నిమజ్జనం పూర్తి చేసుకుని, పోరదేవి మొహోరగడ్ నుంచి మహారాష్ట్రలో నిర్మించిన శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి బయలుదేరారు. ఈ ప్రయాణంలో రాము రాథోడ్, రాజు రాథోడ్, భీమ్ సింగ్ చవాన్, తుకారం రాథోడ్, రూప్ సింగ్ రాథోడ్, లింబాజీ, సుభాష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.