ఎం. ఆర్. హెచ్. ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనం
◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో ఈ రోజు జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ.చెర్మన్ వై.నరోత్తం పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఈ రోజు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎందరో విద్యార్థులకు ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత ఎం. ఆర్. హెచ్. ఎస్ స్కూల్ కె దక్కింది అని అన్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞపకం.మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు నేను ఇక్కడ చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న అన్నారు
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ.సుకుమార్ ఎం. ఆర్. హెచ్. ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ స్వామిదాస్,మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.