ఆర్ హెచ్ ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నా
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని జ్ఞపకం.
మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు వచిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి..
మరియు పట్టణ కేంద్రంగా ఉన్నా ఆర్ హెచ్ ఎస్ రూరల్ హై స్కూల్ ఇక్కడి ప్రాంత విద్యార్థులను ఎంతో మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దింది..
అందులో చదువుకున్నా పూర్వ విద్యార్థులు మళ్ళీ ఇలా కలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది,అని వారు మాట్లాడడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ్.సుకుమార్ ఎం ఆర్ హెచ్ ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.