సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:
రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు
ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం
సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు
మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి
వనపర్తి నేటిదాత్రి
Vaibhavalaxmi Shopping Mall
వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం
మందమర్రి నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను
Financial
బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.
“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”
” అధికారులపై చర్యలు తీసుకోండి”
బాలానగర్ / నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Government Land
స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.
రాజ కౌశిక్ విద్యార్థికి హబూబ్ నగర్ లో మాంటిసోరి పాఠశాల జె పి ఎన్ సి ఇంజనీరింగ్ లో అర్టిఫి కల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీట్ సాధించినoదుకు పెబ్బేరు సంబు రాము, సంబు కృష్ణయ్య కల్వ రాలకు చెందిన ప్రభాకర్ దృష్టి కి తీ సుకపోవడముతో విద్యార్థి కి ఉచితంగా లాప్ టాప్ ను అందజేశారని సంబు క్రిష్ణ య్యా తెలిపారు ఈసందర్భంగా ప్రభాకర్ ను రాజ కౌశిక్,కుటుంబ సభ్యులు సంబు కృష్ణయ్య రాము కు కృతజ్ఞతలు తెలిపారు
#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..
#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..
#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…
#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ
హన్మకొండ, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.
పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.
కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది. వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది. టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు. పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.
ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.
మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.” పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది. టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది. మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు.. బంగారు తాకట్టు పెడతామని హామీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాల్ష్, రహస్యలు తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.
సమాజంలో ప్రత్యేకత,ఉన్నత విలువలు,గౌరవం పొందాలంటే చదువొక్కటే మార్గం
◆:- మరోసారి నిరూపించిన జహీరాబాద్ అఖిల
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ ఇటీవల డీఎస్పీగా ఎంపికైన అఖిల.తన తండ్రి పాక్స్ చైర్మన్ జగన్నాథ్ రెడ్డితో కలిసి టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా డీఎస్పీ గా ఎంపికైన అఖిలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బుకంటే,అన్నిటికంటే ముఖ్యం చదువేనని దానికి మన జహీరాబాద్ బిడ్డ డీఎస్పీ గా ఎంపికవ్వడమే నిదర్శనమని(“టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్”) అన్నారు…ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాంగిర్ సురే జాంగిర్ ఖురేషి ముత్తిరామ్ బాసిద్ అక్రమ్ తదితరులు ఉన్నారు,
మొగడంపల్లీ మండలం అసద్ గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముబీన్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చక్కెర & చెరుకు కమిషనర్ జహీరాబాద్ సిడిసి చైర్మన్ గా గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ షుగర్ కంపెనీ అనుసంధానం గా సిడిసి చైర్మన్ గా మహమ్మద్ అబ్దుల్ ముబీన్,డైరెక్టర్లుగా మల్లారెడ్డి,చందర్ నాయక్,వ్యంకటేష్ గోయల్,రవీంద్ర రెడ్డి నియమించారు.ఈసందర్భంగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలో ఆదర్శనగర్ కాలనీ గెస్ట్ హౌస్ లో సిడిసి చైర్మన్,డైరెక్టర్లను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి మరియు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మహేష్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ.. నూతన కలెక్టర్ గా ఎం.హరిత
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు సీఎంఓ సి.ఎస్.ఓ k.రామకృష్ణారావు ఈరోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను బదిలీ చేయడం జరిగినది.ఆయన స్థానంలో నూతన కలెక్టర్ గా ఎం.హరిత 2013 ఐఏఎస్ కేరళ టాపర్ గా నియమితులు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు మరోసారి వినతిపత్రం
జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.అందుకు గాను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఓబిసి చైర్మన్ ఓర్సు తిరుపతిల ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలిసి నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ కు మరోసారి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్కు దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే దంపతుల జయంతి, వర్ధంతులతో పాటు పలు సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని ఆ ప్రాంగణాన్ని జ్యోతిరావు పూలే జంక్షన్ గా నామకరణం చేయడం జరిగిందన్నారు. పూలే దంపతుల విగ్రహా ఏర్పాటు కోసం గత 2024 అక్టోబర్ 26 న మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చాన్నారు.కాగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే మహానీయులైన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ స్ధాపన ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కురిమిల్ల రమేష్,జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కడారి సురేష్ యాదవ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, మంగిశెట్టి సారంగం, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పరిధిలోని కొణెంగల (కొండముచ్చు) దాడిలో శనివారం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాంనగర్ కు చెందిన రాజ్ కుమార్, శరణమ్మ అనేవారు ఈ దాడిలో గాయపడినట్లు సమాచారం. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, గాయపడిన ఇరువురు క్షేమంగానే ఉన్నారు.
బిటిరహదారి లేక బత్తినపల్లి గ్రామ ప్రజల అవస్థలు వర్ణనాతీతం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల బత్తినపల్లి గ్రామానికి సరైన రహదారి లేక ఆ గ్రామ ప్రజలు నరకయాతన పడుతున్నారు వర్షం పడితే ఉన్న రహదారి మొత్తం బురదమయంగా మారి మోటార్ వెహికల్ కూడా నడవలేని పరిస్థితి ఆరోగ్యం బాగోలేని వారిని ఈ రహదారి వెంబటి తరలించాలంటే చుక్కలు కనబడుతున్నాయి అని అంటున్నారు గతంలో ఈ రోడ్డు మంజూరు అయినప్పటికీ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేదని సదరు కాంట్రాక్టర్ రోడ్డు వేయలేదు భద్రాద్రి జిల్లా ఫారెస్ట్ అధికారి పర్మిషన్ లేకపోవడం వలన ఈ రహదారి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ రోడ్డు వేసి మా గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని బత్తిన పల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో మరియు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధ్యక్షులు పోదేం వీరయ్యను కలసి ఈ గ్రామ ప్రజలు పలుమార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడం వలన ఈ గ్రామ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా బత్తినపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం వలన తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు ఇకనైనా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ మరియు ఐటీడీఏ రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకొని బత్తినపల్లి గ్రామానికి రహదారి నిర్మించి ఈ గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటున్నారు
బ్రిడ్జ్ నిర్మించండి! • అత్యవసర సేవలకు ఈ రోడ్డు లో బ్రేక్.. • 5 కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల దూరంలో వెళ్లాలి..
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండలం అతలాకుతులమైంది. నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గ మధ్యలో మల్కచెరువు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి వరద ఉధృతి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోయింది. అలాగే నిజాంపేట, చల్మెడ, బీబీపేట గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో నీరు ప్రవాహం అధికంగా చేరి రోడ్డు పాయలుగా చీలిపోయింది. అయితే ఈ గ్రామాలకు అధికారులు రోడ్డుపై మట్టి పోసి తాత్కాలిక మరమ్మత్తులగా చేశారు. కానీ నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి కూలిపోవడంతో అత్యవసరగా మైన 108 అంబులెన్స్ సేవలు కూడా కష్టతరంగా మారాయి అన్నారు. ఈ రోడ్డులో ఓ ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని నాలుగు గ్రామాల గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఐదు కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల చేరాలంటే చాలా ఇబ్బందిగా పడవలసి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.
చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ నిజాముద్దిన్ ఆనారోగ్యం చేత మరణించగా అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన ముగ్గురు కుమార్తెలు విద్యనభ్యసిస్తుండగా తమ దీన స్థితిని గమనించి మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు . నిరుపేద కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు. పరమర్శించిన వారిలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ,ఉపాధ్యాయులు,గంగనర్సయ్య, వేణుగోపాల్, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ, కనకయ్య ఉన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.
అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.
డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.
ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం(జహీరాబాద్): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివే శారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఓ పక్క కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలతో భవన యజమాని కూల్చివేత పనులు ప్రారంభించారు. కొన్ని ఏళ్ల పాటు ఓ వైపు కుటుం బం నివాసం ఉండటంతో పాటు అప్పట్లో పోలీస్ స్టేషన్, ఆ తర్వాత బీసీ సంక్షేమ వసతి గృహం కొనసాగింది. అనంతరం సినిమా ప్రదర్శనల తోపాటు ప్రైవేటు కార్యాలయం ఏర్పాటు చేశారు.
వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామి 11వ గిరి ప్రదక్షణ శ్రావణమాసం సందర్భంగా మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, ముఖ్య నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి,రవీందర్రావు, మేడి తిరుపతి,ఆర్నే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.