నిరుపేద బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ నిజాముద్దిన్ ఆనారోగ్యం చేత మరణించగా అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన ముగ్గురు కుమార్తెలు విద్యనభ్యసిస్తుండగా తమ దీన స్థితిని గమనించి మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు . నిరుపేద కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు. పరమర్శించిన వారిలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ,ఉపాధ్యాయులు,గంగనర్సయ్య, వేణుగోపాల్, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ, కనకయ్య ఉన్నారు.