ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ…

ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ
– తెలంగాణ కోసం చేసిన ఉద్యమం స్ఫూర్తిదాయకం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల
సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే
మహేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని అన్నారు.
ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.

 

ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని అన్నారు. తన రాజకీయ జీవితమంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడు బాపూజీ అని అన్నారు.
ముఖ్యంగా రైతాంగం కోసం నిస్వార్థంగా కృషి చేశారనీ అన్నారు.
ఆయన చూపిన మార్గం పల్లెబాటలో నడిపే వెలుగుదీపమని అన్నారు.
వారి ఆలోచనలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలనీ, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

ఆయన ఆశయాల సాధనకోసం కృషి చేయాలని అన్నారు.
హైదరాబాద్ సంస్థాన ప్రజలకోసం నిజాం ను ఎదిరించిన యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, వస్త్ర వ్యాపార, అనుబంధ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం…

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల (నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ,పోలీస్ అధికారులు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు.దేశ స్వాతంత్ర్యోద్యమం,తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్నే అంకితం చేశారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఏ. ఓ పద్మ, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు…

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు

– నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మహేష్, గోనె ఎల్లప్ప, గోలి వెంకటరమణ
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version