సమాజంలో ప్రత్యేకత,ఉన్నత విలువలు,గౌరవం పొందాలంటే చదువొక్కటే మార్గం
◆:- మరోసారి నిరూపించిన జహీరాబాద్ అఖిల
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ ఇటీవల డీఎస్పీగా ఎంపికైన అఖిల.తన తండ్రి పాక్స్ చైర్మన్ జగన్నాథ్ రెడ్డితో కలిసి టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా డీఎస్పీ గా ఎంపికైన అఖిలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బుకంటే,అన్నిటికంటే ముఖ్యం చదువేనని దానికి మన జహీరాబాద్ బిడ్డ డీఎస్పీ గా ఎంపికవ్వడమే నిదర్శనమని(“టీఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్”) అన్నారు…ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాంగిర్ సురే జాంగిర్ ఖురేషి ముత్తిరామ్ బాసిద్ అక్రమ్ తదితరులు ఉన్నారు,