బ్రిడ్జ్ నిర్మించండి!
• అత్యవసర సేవలకు ఈ రోడ్డు లో బ్రేక్..
• 5 కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల దూరంలో వెళ్లాలి..
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండలం అతలాకుతులమైంది. నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గ మధ్యలో మల్కచెరువు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి వరద ఉధృతి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోయింది. అలాగే నిజాంపేట, చల్మెడ, బీబీపేట గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో నీరు ప్రవాహం అధికంగా చేరి రోడ్డు పాయలుగా చీలిపోయింది. అయితే ఈ గ్రామాలకు అధికారులు రోడ్డుపై మట్టి పోసి తాత్కాలిక మరమ్మత్తులగా చేశారు. కానీ నిజాంపేట – నస్కల్ వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి కూలిపోవడంతో అత్యవసరగా మైన 108 అంబులెన్స్ సేవలు కూడా కష్టతరంగా మారాయి అన్నారు. ఈ రోడ్డులో ఓ ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని నాలుగు గ్రామాల గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఐదు కిలోమీటర్ల గమ్యాన్ని 11 కిలోమీటర్ల చేరాలంటే చాలా ఇబ్బందిగా పడవలసి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు.