వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామి 11వ గిరి ప్రదక్షణ శ్రావణమాసం సందర్భంగా మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, ముఖ్య నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి,రవీందర్రావు, మేడి తిరుపతి,ఆర్నే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.