సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు.. బంగారు తాకట్టు పెడతామని హామీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాల్ష్, రహస్యలు తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.