*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…

*ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి…

పలమనేరు(నేటిధాత్రి:

ప్రస్తుత విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతున్నారని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి పేర్కొన్నారు.
గంగవరం మండలంలో ప్రీ ఆన్ ఫ్యూచర్ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలను ప్రారంభించారు.
​ వినూత్నమైన ప్లే-బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ప్రారంభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఆటల ద్వారా సాగే ఈ విద్యా విధానం పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక మరియు మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె వివరించారు. ఈ విధానం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారని, భవిష్యత్తులో వారికి ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆమె కోరారు. అనంతరం ​పాఠశాల నిర్వాహకురాలు మౌనికకు మరియు ఆమె బృందానికి అభినందనలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డి పల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటిధాత్రి:

నిత్య కృషీవలుడు, నవ్యాంధ్ర సాధనలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కేక్ కట్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు దూరదృష్టి, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడే తపన అభినందనీయమని, ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి మరింత సేవలందించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టిటిడి నాయకులు రాజశేఖర్ నాయుడు,
సోమశేఖర్ నాయుడు వాసు నాయుడు, గందమనేని నరేష్, బిజేపి చిన్నగొట్టిగల్లు మండలాధ్యక్షులు దండు కిషోర్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ మత్తుం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడిని చిత్తూరు ఎంపీ ఘనంగా ప్రశంసించారు

*ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

*జనం మెచ్చిన నేత, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్త..

*ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధి తెలుగు ముద్దుబిడ్డ చంద్రబాబు..

*భావితరాలకు ఆదర్శనీయులు, అభివృద్ధికి మారు పేరు..

*చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను…

*చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు…

కుప్పం(నేటి ధాత్రి:

ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు.
ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు లాంటి నిత్య శ్రామికులు మరొకరు లేరుని
కుండబద్దలు కొట్టారాయన.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మొదటి రోజు హెలిప్యాడ్ వద్ద సాదర స్వాగతం పలికిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., రెండో రోజు కుప్పంలో నిర్వహించిన పేదల సేవలో ప్రజా వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపి,
జనం మెచ్చిన నేతగా,..ప్రజలు హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.
అలాగే సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్తగా ఎదిగారని,
ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధిగా.., తెలుగు ముద్దుబిడ్డగా.‌., చంద్రబాబు ఖ్యాతి గడించారని అభినందించారు.
భావితరాలకు ఆదర్శప్రాయంగా.., అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి, నవ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రశంసించారు.
చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, కుప్పం ప్రగతిలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అదే సమయంలో చిత్తూరు పార్లమెంటు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చెప్పారు.

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు..

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు

 

భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు… అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా..

ఆ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

 కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

సీఎం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి పరామర్శించనున్నారు మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌తో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నట్లు సీఎంకు వివరించారు మంత్రి సంధ్యారాణి. అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

 పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..

 పవన్ ఇంటికి చంద్రబాబు.. అసలు విషయమిదే..

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:40 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వైరల్ ఫీవర్‌ (Viral fever)తో ఇబ్బంది పడుతున్న పవన్‌ను పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీకి, తన శాఖలపై సమీక్షలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌‌కు వైద్యం అందించారు. వైద్యులకు చూయించిన జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చూయించుకున్నట్లు సమాచారం. ఇంకా జ్వరంతోనే ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version