బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు…

బ‌ర్దీపూర్ ఆశ్రమంలో వైభవంగా దత్తగిరి మహారాజ్ ఆరాధన మహోత్సవాలు

◆-: ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆-: డా౹౹ సిద్ధం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఝరాసంగం మండలంలోని సుప్రసిద్ధ బర్దీపూర్ ఆశ్రమం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.శ్రీ దత్తగిరి మహారాజ్ వార్షిక అమర తిథిని పురస్కరించుకుని ఆశ్రమ ప్రాంగణంలో మహా మృత్యుంజయ మంత్ర శత సహస్ర జపయజ్ఞం, దత్తహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.​ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.బర్దిపూర్ ఆశ్రమ అప్ప వారిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ దత్తగిరి మహారాజ్ వంటి మహనీయుల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ జపయజ్ఞం అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటునన్నారు. ఈ కార్యక్రమంలో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,నర్సింహారెడ్డి,అశ్విన్ పాటిల్,జగదీశ్వర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి…

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి

◆-: జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ని ఆవిష్కరించిన మహామండలేశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివారం నాడు బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి పిలుపునిచ్చారు.జహీరాబాద్ పట్టణంలో ఈ నెల 15న నిర్వహించనున్న సేవాలాల్ జయంతి ఉత్సవాలు, శోభాయాత్రకు సంబంధించిన గోడపత్రికను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మాట్లాడుతు సేవాలాల్ మహారాజ్ బోధనలు యువత అనుసరించాలని, సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, సేవాలాల్ మహరాజ్ బోధనలను తూచా తప్పకుండా పాటించి జీవితంలో విజయం సాధించాలని సూచించారు. జయంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భారీ ఎత్తున జరగనున్న ఉత్సవాలకు తన బృందం ద్వారా తప్పకుండా హాజరు అవుతానని ఈ సందర్భంగా అన్నారు. సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని స్థానిక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుభాష్ రాథోడ్ బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ మహామండలేశ్వర్ సిద్ధగిరినందగిరి కి బహుకరించాగ, వారు పిపి సుభాష్ రాథోడ్ కి శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రాథోడ్, డాక్టర్ సుభాష్ జాదవ్, కోశాధికారి నరేష్ చవాన్, విజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి…

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాయత్రి, గురువారం దత్త జయంతి సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ఆశ్రమానికి వెళ్లి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, మాజీ సర్పంచ్ గాజుల బాల కిష్టయ్య, వార్డు అభ్యర్థులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు…

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోనే దత్తక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి ఈ నెల 4న దత్తజయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దత్తజయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పర్యవేక్షణలో ఈనెల 2, 3, 4 తేదీల్లో 21 యజ్ఞగుండాలతో దత్తయజ్ఞాలు, శ్రీచండీ హోమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరనందగిరి

పేర్కొన్నారు. యజ్ఞాల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం పచ్చటి పందిళ్లు, తాగునీరు, భోజన వసతి, భక్తులకు దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మందిరం, జ్యోతిర్లింగాల మండపం, ఆత్రేయ మహర్షి, అనసూయ, గోమందిరం, రేణుకామాత మందిరాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version