చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు…

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

 

గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..

 గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చిందని ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందన్నారు.

అభివృద్ధికి పునాదులు వేసింది టీడీపీనే..

ప్రజలతో ఉంటే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2028 నాటికి తన రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధికి పునాదులు వేసింది.. వేసేది టీడీపీనేనని.. విజన్-2020తో ఇది నిరూపితమైందని వెల్లడించారు. ప్రజల భవిష్యత్, ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలని తెలిపారు. భారతదేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పామని.. చేసి చూపించామని అన్నారు. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తులకు రాయలసీమ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

రాయలసీమలో ఉద్యాన రంగం అభివద్ధి..

రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ప్రతి వారం విశ్లేషిస్తూనే ఉన్నానని తెలిపారు. కార్యకర్తలకు, తనకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు పార్టీలో కూడా టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. సంక్షేమం తెస్తామని ఇంటింటికీ వెళ్లి చెప్పామని… ఆ సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు కూడా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

 

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ స్వాత్(Special Weapons and Tactics Teams)లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27), తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కలిచివేసే వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో ఆమె(కాజల్) సోదరుడు నిఖిల్ (ఈయన కూడా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్) కు ఫోన్ చేశాడు. ‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి, ఆమెపై దాడికి దిగాడు.

ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పడం గమనార్హం.

ఘటన నేపథ్యం..

జనవరి 22న ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్-అంకుర్ నివాసంలో ఈ ఘటన జరిగింది. భర్త.. నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టి, ఆపై బరువైన డంబెల్ (Dumbbell)తో ఆమె తలపై దాడి చేశాడు.

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి…

మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి

 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.

అమరావతి, జనవరి 30: ఈ రోజు జనవరి 30 భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

‘జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version