సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు… అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
