కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్ రేవూరి.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి

భూపాలపల్లి నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన.

కామ్రేడ్ గాజర్ల రవి మృతికి సంతాపం తెలిపిన టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) జర్నలిస్ట్ యూనియన్ .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి తీరని లోటని భూపాలపల్లి ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్ , సామంతుల శ్యామ్ లు అన్నారు.

వెలిశాల గ్రామంలో శుక్రవారం గాజర్ల రవి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

 

కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..

పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని అన్నారు.

కార్యక్రమంలో చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య జర్నలిస్టులు పుల్ల రవితేజ కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు

భూపాలపల్లి నేటిధాత్రి:

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన .!

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సమావేశం కామ్రేడ్ భాశెట్టి గంగారం భవన్లో గురువారం రోజున ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు పరచాలి అని ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్నవ మారనా హోమాన్ని వెంటనే రద్దు చేసుకొని వారితో శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలి, గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ పోరు భూములను పట్టాలు ఇవ్వాలి అలాగే ఎన్నిక హామీల్లో భాగమైన పేద వర్గాల కు నూతన రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి.

 

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో ఉన్న బొగ్గు గనుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంటికి రాయి యాజమాన్యం చెల్లించాలి, బొగ్గు గాని కార్మికులకు సొంత ఇంటి పథకంలో భాగంగా రెండు గంటల భూమి వారికి సంబంధించిన బడ్జెట్ సపోర్ట్ ను యాజమాన్యం కల్పించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు మంచిర్యాల జిల్లాలో బలమైన నిర్మాణం కలిగి ఉన్న నేపథ్యంలో పార్టీ ఆఫీసు కు జిల్లా కేంద్రంలో ఒక ఎకరం భూమి కేటాయించాలి 2024. 25 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి గని కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించాలి.

 

 

 

 

సింగరేణి నూతన బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, బెల్లంపల్లిలో బస్సు డిపోను నిర్మించాలి అని అన్నారు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ సిపిఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య పట్టణ కార్యదర్శి ఆడపుq రాజమౌళి, సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ , జిల్లా సభ్యులు గుండా చంద్రమాణిక్యం, డి ఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, సీనియర్ మహిళా కామ్రేడ్ గుండ సరోజ, బొల్లం సోని, బియ్యాల ఉపేందర్, కొండు బానేష్, అక్కేపల్లిబాబు సార్, రత్నం రాజం ,తిరుపతి గౌడ్, మంతెన రమేష్, బండారి శంకర్, బోర్ల సమ్మయ్య, గోలేటి రాజలింగు, నస్పూరి తిరుమలేష్, గుండ ప్రశాంత్, అంబాల ప్రభుదాస్ నస్పూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉదయ్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కామ్రేడ్ చంద్రగిరి శంకర్ గాజర్ల అశోక్ తో కలిసి గాజర్ల రవి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన ప్రజల కోసం తన జీవితం అంకితం చేసిన విప్లవ యోధుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ప్రత్యేక జోన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి మృతి చెందడం జరిగింది 40 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో పనిచేసే వీర మరణం పొందాడు అని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు.

కామ్రేడ్ యాకయ్య ఆకస్మిక మరణం పేదల పోరాటాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

యాకయ్య మృతదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాలలు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సభ్యుడు పట్టణ నాయకుడు కామ్రేడ్ కుక్కల యాకయ్య ఆకస్మిక మరణం పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జ్యోతిబసు నగర్ లో అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య అనారోగ్యంతో ఆకస్మికంగా ఆయన స్వగృహంలో చనిపోగా మృతదేహాన్ని సందర్శించి పార్టీ ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యాకయ్య పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడిగా నర్సంపేట పట్టణ నాయకుడిగా పనిచేసాడని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎర్ర జెండా పట్టి నిరంతరం పోరాడిన నిస్వార్థ జీవి అని ఆయన లేని లోటు పార్టీకి ప్రజా ఉద్యమాలకు ఎనలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ కుక్కల యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు వంగల రాగసుధ యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్, డివిజన్ కమిటీ సభ్యులు మోటం సురేష్, బండారి మల్లేశం, జ్యోతిబస్ నగర్ కాలనీవాసులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ.

*కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ
వర్ధంతి నివాళులు*

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణం లో ఈరోజు మే 22 కార్మిక ఉద్యమ నేత , అమరజీవి కామ్రేడ్. పర్స సత్యనారాయణ 10 వ. వర్ధంతి సందర్భంగా బి.వై. నగర్ లోని కామ్రేడ్. అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ లో CITU ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల సమస్యలు , హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్.. పర్సా సత్యనారాయణ ని కొనియాడారు.కామ్రేడ్.. పర్స సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని వర్గాల కార్మికులందరిపై ఉందని వారి పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై , కార్మిక చట్టాల , హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క కార్మికుడు పోరాటాలలో భాగస్వామ్యం అయ్యి హక్కులను సాధించుకోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళులు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి

కమ్యూనిస్టు కుటుంబాలకు అరుదైన గౌరవం
లక్ష్మయ్య స్మారక స్తూపం ఎదుట అరుణ పతాకావిష్కరణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

పీడిత తాడిత శ్రామిక వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మరవలేనివని, ఎందరో నాయకులు భౌతికంగా దూరమైన వారిని స్మరిస్తూ వారి కుటుంబాలకు ఇప్పటికీ సమాజంలో అరుదైన గౌరవం లభిస్తున్నదని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఏఐటిఈసి జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, ఎంసీపీఐ మండల కార్యదర్శి గాజుల వెంకటయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, తెలంగాణ గిరిజన రత్న వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు.నెక్కొండ మండల కేంద్రంలో స్థానిక జిపిఎస్ పాఠశాల ఎదురుగా కమ్యూనిస్టు దివంగత నేత కామ్రేడ్ బూరుగుపల్లి లక్ష్మయ్య స్మారకస్తూపం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేసి దివంగత కమ్యూనిస్టు నేత లక్ష్మయ్యకు ఘన నివాళులు అర్పించారు. నెక్కొండ మండలంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ ట్రేడ్ యూనియన్ల నాయకులు లక్ష్మయ్య సేవలను స్మరించి ఎందుకు ఒకే వేదికను పంచుకోవడం అద్భుతమైన ఘట్టమన్నారు. విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పీడిత వర్గాల పక్షాన తుది శ్వాస విడిచే వరకు పోరాడిన లక్ష్మయ్య సేవలను స్మరించేందుకు ఒక వేదిక పైకి రావడం తమకు ఆనందంగా ఉందన్నారు. మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ శ్రామిక వర్గాల గుండెల్లో బూరుగుపల్లి లక్ష్మయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చాగంటి వెంకటయ్య, సిఐటియు మండల అధ్యక్షులు భూక్య నరేశ్ ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు, నాయకులు మదార్ కృష్ణ ,భస్క శ్రీను, మోహన్ బిర్రు రమేష్, దేవేందర్, హైమ, సూరమ్మ, ఉపేంద్ర, సబిత, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు, గుమస్తా సంఘం నాయకులు, భావన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మార్త మధుసూదన్,సురేష్,కందిక వెంకన్న, లక్ష్మణ్ ,రాజు, సొసైటీ మాజీ చైర్మన్ , బిఆర్ఎస్ నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, ఎంసీపీఐ మండల నాయకులు జల్లి బుచ్చయ్య, గాజుల వెంకటయ్య ,సొల్లేటి రామబ్రహ్మం, ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ నాయక్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి.!

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.

కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version