జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తంగళ్ళపల్లి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తనిఖీ చేయడం జరిగింది..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
ఈ సందర్భంగా. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించే వ్యాధి నిరోధక టీకాలను రిజిస్టర్ లను పరిశీలించి. చిన్నపిల్లలకు తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాలపైఅవగాహన కల్పించి పిల్లలకు సకాలంలో టీకాలు తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప. చేయవలసిందిగా .మండల వైద్యాధికారి డాక్టర్ స్నేహ కి వైద్య సిబ్బందికి సూచిస్తూ. మండలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది ఆశ వర్కర్లతో మండలంలోని ప్రతి గ్రామంలో వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఏమైనా అవసరాలు ఉన్నచో వారికి అత్యవసరటైంలో వైద్యం అందించే ప్రక్రియ కొనసాగించాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు ఇట్టి కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్నేహ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
