నేరెళ్ల పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్…..

నేరెళ్ల పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్చార్జి కలెక్టర్. గరీమా అగ్రవాల్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని. ఈ సీజన్లో వచ్చే వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వైద్యుల. సిబ్బంది. హాజరు రిజిస్టర్. రక్త పరీక్షలు చేసే ల్యాబ్. మందులు ఇచ్చే గది. ఇతర గదుల ఆవరణ ను. పరిశీలించారు. వ్యాక్సిన్ల. మందుల నిలువుపై.ఆరా తీశారు ఎలాంటి సమాచారం లేకుండా. విధులకు . హాజరుకాని. ఫార్మసిస్టు సూపర్వైజర్ కు సోకాజు నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని .ఆదేశించారు. రోజు ఆసుపత్రికి ఎందరో రోగులు వస్తున్నారని. ఎందరు గర్భిణీలు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. వైద్యులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో నేరెళ్ల. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గీసుగొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు. ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని,స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని సూచించారు.
కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version