నేనెప్పుడూ ప్రజల వెంటే
వార్డులో సమస్యల పరిష్కారానికి ముందువరుసలో నేను
మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్
పరకాల నేటిధాత్రి
మున్సిపాలిటీలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఎప్పటికప్పుడు సానిటేషన్ పనులుచేపడుతున్నారు.పదవికాలం ముగిసినప్పటికి నేనెప్పుడు ప్రజల వెంటే ప్రజలకోసమే అన్నరీతిలో సమస్యలకు తనదైన శైలిలో పరిస్కారం చూపుతున్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఇంటింటి చెత్త స్వచ్ఛ ఆటోల ద్వారా క్రమం తప్పకుండా వీధులలోని చెత్త ట్రాక్టర్ల ద్వారా సేకరించాలని, దుర్వాసన వస్తున్న పరిసర ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వవున్న ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించాలని,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పాగింగ్ చేపించి,డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీపించి,తీసిన చెత్త కుప్పలు వెను వెంటనే శుభ్రంగా ఉంచాలని,వార్డులో సంచరించే కోతుల,కుక్కల బెడద ఉందని వాటినుండి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని,వార్డులోని ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేలా చూడాలని స్థానిక కౌన్సిలర్ కమిషనర్ సుస్మ ని కోరారు.