బస్టాండ్ ఆవరణం బురదమయం
నీరునిల్వ వల్ల దోమలతో ప్రయాణికులకు ఇబ్బందులు
మరమ్మత్తులు చేయించాలని ప్రయాణికుల ఆవేదన
పరకాల నేటిధాత్రి
గత రెండురోజుల నుండి ఎడతెగక కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగాణం గుంతల్లో,లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరి బురదమయమయ్యింది.ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో నడిచే సమయంలో బస్సులు వస్తే బురద నీరు ప్రయాణికుల మీద పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు పగుళ్ళు ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి అపరిశుభ్రంగా ఉంటోందని,స్విపర్లు చెత్త డబ్బాలు ఉన్నప్పటికీ చెత్త వాటిలో వేయకుండా పక్కన పడేస్తున్నారని సాయంకాలం వచ్చే సరికి ప్రాంగణంలో నీరునిల్వ ఉండటంతో దోమలు గుమికూడి కుడుతున్నాయని ప్రయాణికులు దోమలు,ఈగలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిపో మేనేజర్ సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో తాత్కాలిక మరమ్మత్తులు చేసి సీజనల్ వ్యాధుల భారిన పడకుండ ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ ను జల్లించాలని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.