గ్రామ స్థాయిలో సర్పంచ్ లు లేకపోవడంతో కుంటుపడుతున్న అభివృద్ధి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గ్రామాల్లో పాలకవర్గాల పాలన లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని బి అర్ ఎస్ యువ నాయకులు షేక్ సోహేల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ప్రత్యేకాధికారుల ముగిసి పాలన సాగుతోంది అని. ప్రత్యేకాధికారులు వారివారి బాధ్యతల్లో బిజీగా ఉండటంతో పాలన గాడితప్పింది అన్నారు. ఇప్పటికే పలుమార్లు పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని తెలిపినా అధికారుల్లో మార్పు రావడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయితే ప్రతీ చిన్న పనికి ప్రత్యేకాధికారుల అనుమతి తీసుకుని రావాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేని సమయాల్లో కార్యదర్శులు ఇబ్బందులు పడుతూ పంచాయతీల్లోని విధులు ఎలాగోలా నెట్టుకు వస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఏడాదిగా విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వెంటనే పాలకవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించాలని కోరారు..