కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version