పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి విన్నపం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఆదివారం రోజు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ దీర్ఘకాలకు సెలవు పై వెళ్లడం వలన మునిసిపల్ జరుగు అభివృద్ధి కార్యక్రమాలు పాలనపరమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు ఏర్పడుతుంది. కేవలం కొద్దిరోజుల వరకే కమిషనర్ లీవ్ లో వెళితే బాగుండేది కానీ దీర్ఘకాలం సెలవు పై వెళ్లడం వలన 39 వార్డులతో ఉన్న సిరిసిల్ల పట్టణం చాలా పెద్ద మున్సిపల్ గా ఉన్న వ్యవహారాలలో ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నవి. మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన ఎదురు కావడం పాలకవర్గం లేకపోవడంతో ఎవరు కూడా దీని మీద శ్రద్ధ కనబడుచుక పోవడం ఒకింత బాధ కలిగించి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో కమిషనర్ నియమించాలి కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేసి పూర్తి కలెక్టర్ నియమించాలి పాలన పాలనమైన వివారాలల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా కమిషనర్ నియమించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యం కార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చీకోట అనిల్ సహాయ కార్యదర్శి, కుసుమ గణేష్ కోశాధికారి చెప్ప దేవదాస్ సభ్యులు, నల్ల మురళి మేము ప్రజల పక్షాన కమిషనర్ నియమించాలని కోరుతున్నాము.

సివిల్ సప్లై హమాలి యూనియన్.!

సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రం విడుదల

కేసముద్రం నేటి ధాత్రి:

మే 18న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి మండల కార్యదర్శి మంద భాస్కర్, సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ , చొప్పరి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సంస్కరణ పేరుతో చట్టాలను సవరించి కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకునేందుకు కుట్ర పండుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. కేసముద్రంలో జరిగే జిల్లా మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ఐదు ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి హమాలీ కార్మికులతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ బిక్షపతి హాజరవుతారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య, రాజబోయిన శ్రీను, నరముల యాకయ్య, బిచ్చు, రాజు, యాకయ్య, రెంటాల వెంకన్న, నగేష్, తాటికాయల యాకయ్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన.

జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన ఇరు బార్ అసోసియేషన్ల:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

బుధవారం రోజున ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జి అర్హత పోటీ పరీక్షల్లో ఎంపికైన వారిని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి నియామకాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ముగ్గురు మహిళా న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయి మేఘన మరియు న్యాయశాఖ ఉద్యోగిి లడే రాజుల ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ఇట్టి సందర్భంగా పలువురు సీనియర్
న్యాయవాదులు మాట్లాడుతూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నల్గురు జడ్జిలుగా ఎంపిక కావడం చాలా సంతోషకరం అన్నారు. గతంలో కూడా చాలా మంది ఈ బార్ అసోసియేషన్ల నుండి జడ్జిలుగా ఎంపికై వివిధ న్యాయస్థానాలలో జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ మరియు వరంగల్ ప్రధాన కార్యదర్శులు కె.రవి, డి.రమాకాంత్ మరియు ఇరు కమిటీ సబ్యులు మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు,మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్.!

జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. కవిత దేవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జూన్ 14 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పునస్కరించుకొని స్థానిక కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి సమావేశమై తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజి మార్గం ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులందరు లోక్ ఆదాలత్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లోక్ ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదాచేసుకున్నవారావుతారని సూచించారు. బాధితులు, కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. లోక్ ఆదాలత్ పై ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను గాని, న్యాయ వాదులను గాని, పోలీస్ ఉన్నతధికారులను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రింట్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version