వార్ 2 హక్కులు ఆ సంస్థకే
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ…
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బేనర్‌పై తెలుగు రాష్ట్రాల్లో ‘వార్-2’ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన తారక్ సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నటించిన రెండు సినిమాలు ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ మా బేనర్‌పై విడుదలయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్-2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం’ అంటూ నిర్మాత నాగవంశీ ఓ వీడియోను షేర్ చేశారు. ’వార్-2’ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.