*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..
*ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్న తీరు అభినందనీయం..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు (ఢిల్లీ)
నేటి ధాత్రి) ఆగస్ట్ 01:
ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా
ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…, ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం.., శాఖల వారీగా.., అందిస్తున్న తోడ్పాటు అభినందినీయమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఇదే మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ ను ప్రగతి పథం వైపు అడుగులేయించాలన్నదే తన సంకల్పమన్నారు.ఈ నేపథ్యంలోనే లోకసభలో ఏపీ కూటమి ఎంపీల బృందం తమ వాణిని వినిపిస్తోందన్నారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీ,స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తి. కార్యరూపం దాల్చేవ్విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అదేవిధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి విషయాలను ఎన్డీఏ సర్కార్ ముందుంచి, ఫలితాలను రాబట్టే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
అమరావతి అభివృద్ధికి సహకారం. మామిడిరైతుల సమస్యకు పరిష్కారమైన మార్గమైన మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మామిడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు,వారి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ వివరించారు.