పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

*ఓంకార్ గారి శత వేలాదిగా తరలిరావాలి *.!

*ఓంకార్ గారి శత జయంతి సభకు వేలాదిగా తరలిరావాలి *

ఎంసిపిఐ (యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి

మాదన్నపేట లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈ నెల 12న వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మచ్చాపురం గ్రామంలో గల స్థూపం వద్ద జరిగే అమరజీవి,అసెంబ్లీ టైగర్, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఎంసిపిఐ(యు) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఓంకార్ శతజయంతి సభ
వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాజమౌళి మాట్లాడుతూ ఆనాడు నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల ప్రతినిధిగా ఎన్నికైన ఓంకార్ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అసెంబ్లీలో గలమెత్తాడని దాంతో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా , సమస్యలను అధ్యయనం చేసి ప్రజల మనిషిగా గుర్తింపు పొందాడన్నారు. నేటి పాలకులు సమస్యలు తీర్చకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ పేదవాళ్లను మరింత పేదవాళ్లుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్య మానవుని కనీస అవసరాలను తీర్చకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వ్యాపార లావాదేవీల కోసం పాకులాడుతూ కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.ఓంకార్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు .ఈ సభలో ప్రముఖ కవులు ,గోరటి వెంకన్న ,జయరాజు ప్రముఖ కవి , గాయకులు యోచన , ప్రజాకళాకారులు , వామపక్ష పార్టీల నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు,మేధావులు విద్యార్థులు,ప్రజాసంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశెట్టి సదానందం,అనుమాల రమేష్,
కేశెట్టి శ్రీను ,కొప్పుల సమ్మక్క,కర్నే సాంబయ్య ఆకుల రాజేందర్, కందికొండ సాంబయ్య ,వక్కల రాజమౌళి , కేశెట్టి పెద్ద సాంబయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version