పురాణాలు, చరిత్ర ఆధారంగా వీరమల్లు పాత్ర..

పురాణాలు, చరిత్ర ఆధారంగా వీరమల్లు పాత్ర

పవన్‌ కల్యాణ్‌ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్‌ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అది..కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు?

ఏపీ భవన్‌లో ప్రత్యేక షో!పవన్‌ కల్యాణ్‌ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తదుపరి నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్‌ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.

ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘మొఘల్‌ చక్రవర్తులు హిందువులను ఇబ్బందికి గురిచేస్తూ, దేవాలయాలు నాశనం చేసిన చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. వీరమల్లు చిన్నప్పటి నుంచి ఓ గుడిలో పెరిగాడు. అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. వేద గ్రంథాలను నాశనం చేసినప్పుడు ‘హరి హర వీరమల్లు’ బలంగా నిలబడ్డాడు. మొఘల్‌ చక్రవర్తుల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వేదాలలోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని తనే ఒక వేద పండితుడిగా మారటంతో వాటిని నాశనం చేయడానికి వీలు లేకుండా పోయింది. అదే సెకెండాఫ్‌లో చూపించాం. వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వాస్తు శాస్త్రంలో  భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వంటి పంచభూతాలను అవగతం చేసుకుని  ధర్మ సంబంధమైన జీవన విధానాన్ని నిర్మించటంలో తన వంతు పాత్రను పోషించాడు. అతని దూరదృష్టి, నైపుణ్యం మరెవరితోనూ పోల్చలేవివి. అందుకు చాలా ఉదాహరణలు సినిమాలో అంతర్భాగంగా కనిపిస్తాయి. సినిమాలో గుల్ఫమ్‌ ఖాన్‌ (కబీర్‌ దుహాన్‌ సింగ్‌)ను కొండపై జరిగే ప్రమాదం నుంచి కాపాడతాడు. అలాగే వరుణ యాగాన్ని అడ్డుకోవాలని చూసే వారి నుంచి   రక్షించి వరుణ దేవుడు కరుణించేలా చేస్తాడు. తోడేళ్లు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటితో మానసికమైన సంభాషణ చేసి తన తోటి వారికి ప్రమాదం జరగకుండా చూస్తాడు. అలాగే అయోధ్య నుంచి రాముడు లంకకు పయనిస్తున్న సమయంలో ఆయన ప్రయాణం అనేక ప్రాంతాల్లో సాగింది. అందుచేత రామాయణ కథకు ఆ ప్రాంతాలకు విడదీయరాని సంబంఽధం కలిగి ఉంది.  శ్రీరాముడి ప్రయాణంలో చిత్రకూట, పంచవటి, క్రౌంచ అరణ్యం, మతంగ ఆశ్రమం, బునిశ్యమూక పర్వతం వంటి ప్రసిద్థ ప్రాంతాల్లో ఆయన అడుగులు పడ్డాయి. అవన్నీ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా, మరచిపోలేని మైలురాళ్లుగా వందల ఏళ్లు గడిచిన ఇప్పటికీ ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నాయి. అలాగే హరి హర వీరమల్లు సినిమాలో తన ప్రయాణాన్ని గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు సాగించారు. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు సాగిన ఈ ప్రయాణంలో కథానాయకుడు వేద తత్వాలతో ప్రజలకు మంచి పనులు చేయటాన్ని గమనించవచ్చు. ఇతిహాసాన్ని, చరిత్రను మిళితం చేసి వీరమల్లు పాత్ర సనాతన ధర్మాన్ని ఎలా రక్షించాడనేది ఈ సినిమాలో చూపించాం. సినిమా చివర్లో.. వీరమల్లు, ఔరంగజేబు పాత్రలు కలుసుకోవడం అనేది అసాధారణంగా జరుగుతుంది. ప్రకృతి సృష్టించిన విపత్తులో ఇద్దరు కలుసుకుంటారు. ఇదే ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అనాలి. అందుకనే క్లైమాక్స్‌ను ఓ క్లిప్‌ హ్యాంగర్‌లా తెరకెక్కించాం. ఇది రాబోయే భాగానికి కొనసాగింపుగా ఉంటుందనే అర్థానిస్తుంది’ అన్నారు.
కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు..
సినిమా విడుదల రోజే సాయంత్రానికి ఎంత కలెక్ట్‌ చేసిందో పోస్టర్‌ విడుదల చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్‌ నుంచి ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందన్నది చిత్ర బృందం ప్రస్తావించలేదు. కలెక్షన్స్‌ పోస్టర్‌ ఎందుకు రిలీజ్‌ చేయలేదని దర్శకుడిని ప్రశ్నించగా జ్యోతికృష్ణ స్పందించారు. ‘మనం నిజాయతీగా కలెక్షన్స్‌ గురించి చెప్పినా.. కరెక్టా, కాదా అని చాలామంది చర్చిస్తుంటారు. విమర్శలు చేస్తుంటారు. కలెక్షన్స్‌ గురించి ఓ అంచనా అందరికీ ఉంటుంది. ట్రేడ్‌ ఎనలిస్ట్‌లు చెబుతూనే ఉంటారు. అందుకే ఒకప్పటిలాగా ‘విజయవంతంగా సినిమా ఆడుతోంది’ అని పోస్టర్ల ద్వారా చెబుతున్నాం. కలెక్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి ఎలాంటి పోస్టర్‌ రాలేదని చెప్పారు.
ఏపీ భవన్‌లో ప్రత్యేక షో..
హరిహర వీరమల్లు చిత్రాన్ని  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శనివారం రాత్రి ఓ షో ప్రదర్శించగా అధికారులు, ఉద్యోగుల నుంచి మంచి స్పందన దక్కింది. ఆదివారం సాయంత్రం మరో షో వేయనున్నారు.

నేరాల నియంత్రణలో, పోలీస్ జగిలాలు పాత్ర కీలకం..

నేరాల నియంత్రణలో, పోలీస్ జగిలాలు పాత్ర కీలకం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

పోలీస్ జాగిలాలకు నుతంగా నిర్మించిన గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఐపీఎస్
పోలీస్ జగిలాలు (Police Dogs)నేర పరిశోధన,భద్రతా చర్యలు,మాదకద్రవ్యాల నియంత్రణ,విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు.పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు.ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ..విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం,సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ,ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.

మాదకద్రవ్యాలు (Drugs), బాంబులు (Explosives), మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ,వైద్య సంరక్షణ,మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు.ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, మొగిలి, నటేష్,ఆర్.ఐ లు రమేష్,యాదగిరి,ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ లు, డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తీక్,సురేష్, శ్రీనివాస్, కిరణ్,సిబ్బంది పాల్గొన్నారు.

కిల్లర్‌ లుక్‌..

కిల్లర్‌ లుక్‌

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక…

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. శనివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. గన్‌ పట్టుకొని, ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్‌ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ఏ. ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

పవర్‌ఫుల్‌ పాత్రలో..

పవర్‌ఫుల్‌ పాత్రలో

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు…

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేసింది. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ అనే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. శనివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా విడుదల కానుంది.

సీక్వెల్‌ రాబోతోంది.

సీక్వెల్‌ రాబోతోంది

 

 

 

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ…

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపు భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందని ప్రకటించారు మేకర్స్‌. ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ అనేది టైటిల్‌. ‘ఏలినాటి శనిపోయింది. కన్యారాశి టైమ్‌ వచ్చింది’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉందీ చిత్రం. మొదటి పార్ట్‌కు పనిచేసిన చిత్రబృందమే ఈ సీక్వెల్‌లోనూ భాగమవుతున్నారు. తరుణ్‌భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించనున్నారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ.

యువతకు ఆదర్శం రాజీవ్ గాంధీ

⏩ పేద ప్రజల గుండె చప్పుడు రాజీవ్ గాంధీ

⏩18 ఏళ్ల కే ఓటు హక్కు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ

⏩ రాజీవ్ గాంధీ చొరవ వల్లే దేశంలో సాంకేతిక పరిజ్ఞానం

⏩ప్రజాసేవ కోసం ప్రాణ సైతం లెక్కచేయని వీరుడు రాజీవ్ గాంధీ

దుపాకి సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 16వ డివిజన్ పరిధి గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రోజున పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 10.00 గంటలకు భారత రత్న,మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34 వ వర్దంతి సందర్భంగా 16వ డివిజన్ ఆధ్వర్యంలో కీర్తినగర్ క్రాస్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న న్యూఢిల్లీ లో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
1968లో,సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు,
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ,ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు.దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుందని అన్నారు. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు.స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు.రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు.రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అతను విమాన పైలట్‌గా పనిచేసేవారని కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత 1983లో అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగ రక్షకులచే హత్యకు గురయ్యారు.అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.తదుపరి జనరల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగారు.1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు.అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది.రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు(పిసిసి),పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు.మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ముగించారు.పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 1991 మే 21న,రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు.
వారి మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.వారు చేసిన సేవలను ఎప్పటికి అను నిత్యం కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూనే ఉంటుంది. పేద ప్రజలకు గుండె చప్పుడు గాంధీ కుటుంబమని వారు వ్యాఖ్యానించారు.దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, జానపాక అధ్యక్షులు మహమ్మద్ జానీ,గరీబ్ నగర్ అధ్యక్షులు దాసారపు సారయ్య, కీర్తినగర్ అధ్యక్షులు హుజూర్,పరకాల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పిట్టల అనిల్,ప్రధాన కార్యదర్శి వల్లెం సాయికుమార్,పెద్ద జానీ,చెక్క రమేష్, గోదాసి చిన్ని,మాసూద్ అలీ,ప్రతాప్, కొమ్ముల రాజు, బిర్రు ప్రసాద్, రుద్రారపు సదా,అంకేశ్వరపు రాజు, మధుసూధన చారీ, మహిళా నాయకులు మౌనిక,నీలిమ,నూరజహాన్, కర్ణాకర్, రాజశేఖర్,అశోక్, శివ పవన్,అజీమ్,శ్రీనివాస్, మరియు 16వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర.

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర

భారత సాయుధ దళాల పనితీరును చూస్తుంటే గర్వంగా ఉంది

-పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది

-నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ దేశం మొత్తం గర్విస్తుంది

-సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

 

 

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరుపుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడాన్ని చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు

వాట్సాప్ గ్రూప్ ద్వారా సామాజిక చేయూత

శభాష్ నెక్కొండ వాట్సాప్ గ్రూప్ అంటూ పలువురు ప్రశంసలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ అభివృద్ధికైనా, సామాజిక సేవా కార్యక్రమానికైనా, రైల్వే స్టేషన్ సంబంధించి రైలు ఆపడంలో, రాజకీయ బహిరంగ చర్చ కైనా నెక్కొండలో జరిగే ప్రతి అంశానికి ఆతిథ్యమిస్తూ ఏకైక గ్రూప్“ నెక్కొండ పౌరులు“ఈ వాట్సాప్ గ్రూప్ గత పది సంవత్సరాల క్రితం సేవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెక్కొండ నగరానికి సంబంధించి మంచి చెడు తెలుసుకోవడానికి 2014 సంవత్సరంలో దుంప నాగరాజు అనే ఓ పారిశ్రామికవేత్త గ్రూప్ క్రియేట్ చేసి నెక్కొండలో జరిగే ప్రతి విషయాన్ని మంచి చెడులను నెక్కొండ ప్రజలకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూపులో చేరవేస్తూ ఆపద వస్తే మేమున్నామంటూ నిరుపేదలకు మేమున్నామంటూ ఒక భరోసాను కల్పిస్తూ వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్న నెక్కొండ పౌరులు అనే గ్రూపు ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపు లలో చర్చనీ అంశంగా మారింది. వాట్సాప్ గ్రూప్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పోస్టు వారు పెట్టకుండా నెక్కొండ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు రాజకీయ చర్చలకు ప్రజా అభిప్రాయాల సేకరణకు నెక్కొండ కేంద్ర బిందువుగా పనిచేస్తున్న నెక్కొండ పౌరులు పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపు ద్వారా పలువురికి సహాయం

నెక్కొండ పౌరులు అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఏర్పాటు చేయడంలో దీనస్థితిలో చనిపోయిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడంలో నెక్కొండ పౌరులు అనే గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరికి తోచినంత వారు గ్రూప్ అడ్మిన్ అయినా దుంప నాగరాజుకు ఆన్లైన్లో అమౌంట్ చేరవేసి ఇలా చేరవేసిన అమౌంట్ ను పేదరికంతో చనిపోయిన వ్యక్తులకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రూపు ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతనందించడం గమనార్ధం.

సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి.

నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం డిజిపి

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర డి జి పి జితేందర్ ప్రజల ను కోరారు
అమరచింత మండలం మస్తిపూర్ గ్రామంలో మస్తీపూర్ గ్రామస్తుడైన ఐజిపి రమేష్ రెడ్డి గ్రామస్తులు సహకారంతో సహకారం ఏర్పాటు చేసినతో సీసీ కెమెరాలను 46 అధునాతన సీసీ కెమెరాలను అమరచింత మండలం మస్తిపూరు గ్రామంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్ గుర్నాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐ జి రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ ఐజి. సత్యనారాయ జోగులాంబ జోన్ డిఐజి, ఎల్ ఎస్ చౌహన్ వనపర్తి జిల్లా ఎస్పీ,రావుల గిరిధర్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిజిపి జితేందర్ మాట్లాడుతూ.నేరాలను నియంత్రించడంలో నిందితులను దొంగ.తనాలను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు వనపర్తి
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను డిజిపి కోరారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన తెలుస్తుందని, ఎక్కడ ఎలాంటి అలజడి జరిగిన వెంటనే పోలీసులు చేరుకుని నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సిసి కెమెరాలకు జిపిఎస్ కనెక్ట్ చేయడం వల్ల అమరచింత మస్తీపూర్ నుండి జిల్లా కమాండ్ కంట్రోల్ కు మరియు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి వీక్షించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.నేరాలు నియంత్రించవచ్చని తద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని, సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం మరియు అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు వివిధ సంఘటన లు జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని డి జి పి తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ
సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని అన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఆర్, గుర్నాథ్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి శ్రీ రమేష్ రెడ్డి ఐపీఎస్ గారు, మల్టీజోన్ -2 ఐజి, శ్రీ సత్యనారాయణ ఐపీఎస్, గారు , జోగులాంబ జోన్ డిఐజి, శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్, గారు వనపర్తి ఎస్పీ, శ్రీ, రావుల గిరిధర్ ఐపీఎస్, గారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు వనపర్తి ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి గారు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు గారు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, అమరచింత ఎస్సై, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version