మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం
జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం సర్పంచ్ సరిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సొంత ఖర్చులతో బహుమతులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
