పాలక వర్గానికి గౌడ కులస్తులు సన్మానం..

పాలక వర్గానికి గౌడ కులస్తులు సన్మానం

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ రేణుక దేవత ఎల్లమ్మ సిద్దోగం సందర్బంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు స్థానిక గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ… గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధొగం మంగళవారం జరిగుతుందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు, ప్రజలు, మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాందాల శారద అబ్రహం,ఉప సర్పంచ్ అనపర్తి నరేష్ కుమార్, వార్డ్ సభ్యులు అర్షం లావణ్య, అర్షం అనూష, పాటి రేణుక,ఈసరి శిల్ప, లింగాల శ్రీనివాస్,తూం గణేష్,పాటి సుధాకర్,గుంటపెల్లి నారాయణ,పిట్ల మనోహర్, గ్రామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, గౌడ కులస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో నూతన గ్రామపంచాయతీలప్రమాణ స్వీకారం….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో నూతన గ్రామపంచాయతీలప్రమాణ స్వీకారం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పల్లి గ్రామంలో నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికల జరగా నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచులుఉపసర్పంచులు వార్డుమెంబర్లు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలలొ గ్రామపంచాయతీ అధికారులచే ప్రతి గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచులువార్డు మెంబర్లచే ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా మండలంలో పలు గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్.వార్డు మెంబర్లు ప్రతి గ్రామంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ గ్రామంలో ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతుంది గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటూ పార్టీలకతీతంగా పని చేసుకుంటూ పోతూ ప్రతి గ్రామంలో ప్రజలందరినీ సమానంగా చూసుకుంటూ ఎటువంటి ఆపద సమయంలోనైనా ముందుంటూ ప్రజాసేవేమార్గంగా సేవే మార్గంగా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలు కష్టసుఖాలుచూసుకుంటూ గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ప్రజల మమ్ములను ఆశీర్వదించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకుగాను ప్రజలకు అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ గ్రామానికి పై అధికారులతో మాట్లాడి అత్యధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతామని ఎటువంటి లాభ నష్టాలు చూసుకోకుండా అభివృద్ధి మార్గంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని గ్రామంలో ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజలు ప్రభుత్వాధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని గెలిచిన సర్పంచ్లను ఉప సర్పంచ్లను వార్డ్ మెంబర్లు ఘనంగా సన్మానించి గ్రామంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందుండి నడిపించాలని ప్రజలు కోరుకుంటూ ప్రతి గ్రామంలో సర్పంచ్ను వార్డుము సభ్యులందరిని ఘనంగా సన్మానించి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకు వెళ్ళని ప్రజలు కోరారు

తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు..

తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు

అర్పించిన…కట్రియాల ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్ & టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య & మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్ & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని, కట్రీయాల గ్రామములో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటికాయాల కుమారస్వామి గారి మాతృమూర్తి తాటికాయల సత్తెమ్మ గారు మరణించడం జరిగింది .కనుక ఇట్టి విషయం వర్ధన్నపేట శాసన సభ్యులు కే. ఆర్.నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. భౌతిక దేహాన్ని సందర్శించండి అని ఆదేశించడంతో , కుమారస్వామి గారి నివాసం వద్దకు గ్రామ ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి అక్బర్ లు చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమములో 7 వ వార్డు సభ్యులు ఎలికట్టే చిన్న రాజు, కాంగ్రెస్ యువ నాయకులు కొండ్రతి సంతోష్,ఇరుకు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సిద్ధాపుర్ తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు నూతనంగా గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.వారికి ఎమ్మెల్యే మాణిక్ రావు పూల మాల వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య…

సంకేపల్లి నూతన ప్రజాప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే యాదయ్య

నేటిధాత్రి, శంకర్ పల్లి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంకేపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ గా దేశ్పాండే శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా ఉప్పరి రవీందర్ సగర, వార్డ్ మెంబర్లు గా తాళ్లపల్లి రుక్కమ్మ, కవ్వగూడెం మల్లేశం యాదవ్, ఉప్పరి లావణ్య శ్రీనివాస్ సగర, తోకల గోవర్థన్ యాదవ్, తోకల సబిత పరమేశ్వర్ యాదవ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

 

 

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టడం కోసం కృషి చేస్తానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని హమీ ఇచ్చారు. అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version