టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌.

 టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌

 

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‏కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్‌ ఝలక్‌ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.

చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షులు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ మాజీ మేనేజర్‌, ‘కలప్పై మక్కల్‌ ఇయక్కం’ అధ్యక్షుడు పీటీ సెల్వకుమార్‌ డీఎంకేలో చేరారు. స్థానిక తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆయన డీఎంకేలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ భారతి, మంత్రి పీకే శేఖర్‌బాబు, ఆలంకుళం ఎమ్మెల్యే మనోజ్‌ పాండిన్‌ తదితరులు ఉన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం, రూపీరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ముడతనపెల్లి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ వీడి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వారికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పంచగిరి సుధాకర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మేడిపల్లి అశోక్,కొండా సురేందర్, పన్నాటి శ్రీనివాస్ కనుకుంట్ల దేవేందర్,రూపిరెడ్డి భగవాన్ రెడ్డి,చంద్రారెడ్డి, మేడిపల్లి ప్రభాకర్,రియాజ్, రావుల రమేష్, సరువు రాజు, వేంకటేష్, రావుల రజినీకాంత్, సదాశివచారి,రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు..

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి సీనియర్ నాయకులు
స్థానిక ఎన్నికల వేళ అయినవోలులో కాంగ్రెస్ పార్టీకి షాక్

నేటి ధాత్రి అయినవోలు:-

 

స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఐనవోలు గ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సీనియర్ నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో చింత అశోక్ (మాజీ వార్డు మెంబెర్ ఎం. ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు)మోలుగురి బాబు (మాజీ సొసైటీ డైరెక్టర్)
బరిగల ఈసాక్ (మాజీ వార్డు మెంబెర్)కొత్తూరి జాన్సన్ (మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి)
చింత రఘు (మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు)సీనియర్ నాయకులు కొత్తూరి కర్రె కొమురయ్య, మోలుగురి లచ్చయ్య,చింత రాములు మంద రాజు మొదలగు వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయినవోలు మండలంలో ఉన్న కీలక నేతకు అనుచర వర్గాలుగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం విశేషం..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోలేపల్లి రాంమూర్తి
మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్
గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version