మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 5 6వ వార్డులు కృష్ణా కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని కాలనీలో పర్యటించారు
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి 5 6వ వార్డు కృష్ణ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
కాలనీలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నా పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాలనీ వాసుల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో సింగరేణి పర్యవేక్షణ లేకుండా పోయిందని,ప్రస్తుతం అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు
కృష్ణ కాలనీలోని భూములను సింగరేణి నేరుగా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యేక జీవో ద్వారా భూములు ఇప్పించి,ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించి కాలనీ వాసులకు అందించామని, అలాగే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసి కాలనీ వాసుల నీటి కష్టాలను తీర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న, ప్రజలను మాయ మాటలతో మోసం చేసే నాయకులకు బుద్ది చెప్పాలన్న రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
