అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ…

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ

సిరిగిరి సురేష్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్

కొత్తగూడ,నేటిధాత్రి:

గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మహాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి పై వస్తున్న అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవని
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కొట్టిపారేశారు. పారదర్శకమైన పాలన అందిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు మరియు బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు స్వార్థ ప్రయోజన శక్తులు పనిగట్టుకొని మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు.
వాస్తవాలు ఇవే..నిరాధారమైన ఆరోపణలు: ఏ ఒక్క ఆధారమూ లేకుండా కేవలం మాటలతో నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది.పారదర్శక టెండర్లు ప్రభుత్వంలో ప్రతి పైసా ఖర్చు డిజిటల్ రూపంలో, పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారానే జరుగుతోంది. ఇందులో అవినీతికి తావులేదు.ప్రజల మద్దతు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ఈ విజయాలను చూసి భయపడే ఇలాంటి తప్పుడు కథనాలుసృష్టిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తప్పవు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, మంత్రి సీతక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.మేము చేసే ప్రతి పని ప్రజల సాక్షిగా, చట్టబద్ధంగానే జరుగుతోంది. ఇలాంటి గాలి వార్తలను ప్రజలు ఎవర నమ్మరని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇకనైనా బుద్ది మర్చికొని అభివృద్ధి లో భాగం కావాలని లేని యెడల ప్రజలే వచ్చే ఎన్నికలో తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు…..

భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

భూపాలపల్లి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానం కావాలి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు శక్తితో అధికార పార్టీ వైఫల్యాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version