బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి…

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్యాదoగి
తిరుపతి ఇంటింటి ప్రచార నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 వ వార్డు లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను కాలనీలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు తాగునీరు సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు కావున 18వ వార్డు ప్రజలు అందరూ గ్యాదoగి తిరుపతి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నిజాంపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు..
నువ్వా! నేనా! అన్నట్టు అభ్యర్థుల ప్రచారాలు.
గ్రామాల్లో ఎన్నికల దావతులు..

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. నిజాంపేట మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే గ్రామాల్లో ఎన్నడు లేని విధంగా సంబంధాలను కలుపుకుంటూ పలకరింపులు కొనసాగుతూ ఉన్నాయి. అభ్యర్థులు తమ అనుచరులతో ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు గ్రామాల్లో ప్రచారాలు కొనసాగిస్తూ.. ఉన్నారు. మరి కొంతమంది కులాల కట్టుబడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. కొంతమంది అభ్యర్థులు పార్టీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లి ఓటును ఆశిస్తున్నారు. అభ్యర్థులు తమ అనుచరులు తమ దాటి వెళ్లకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి దావత్ లతో గ్రామాలు మునిగిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేది ఎవరు ? అనేది ఆసక్తిగా మొదలుకుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా యువతనే పాల్గొంటున్నట్లు కూడా సమాచారం ఉంది.

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం…

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు
ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు…
కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.
పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version