రత్నాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

రత్నాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ఒద్దుల రత్నాకర్ రెడ్డి తల్లి ఒద్దుల సరోజన మృతిచెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని సరోజన పార్టీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో వారి వెంట గ్రామస్తులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

భాదిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్.పెసరు విజయ్ చెందర్ రెడ్డి…

భాదిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్.పెసరు విజయ్ చెందర్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సింగడి శ్రీనివాస్ రెడ్డి సతీమణి ఈశ్వరమ్మ సంవత్సరిక కార్యక్రమానికి బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా నాయకులు కునూరు వీరాస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జ్ గంట శ్రీనివాస్ రెడ్డి,బూత్ అధ్యక్షులు ఏకు సదయ్య, బీజేవైఎం నాయకులు రేగురి శశిధర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లి మండలంలో గండ్ర పరామర్శ…

మొగుళ్ళపల్లి మండలంలో గండ్ర పరామర్శ…
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం లోని మొగుళ్లపల్లి మండలం
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకట్ రావు గారి మామగారు దుగ్యాల చోక్కారావు మరియు వారి బాబాయ్ పిన్నింటి రాజేశ్వర్ రావు మరణించగా మృతుల చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసిన భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించిన తదనంతరం పాత ఇస్సిపేట వాస్తవ్యులు జన్నే సదయ్య గారు అనారోగ్యం తో బాధపడుతున్న వారిని పరామర్శించి,వారికి మనోధైర్యం చెప్పారు.
వారి వెంట సర్పంచ్ జోరుక సదయ్య చిట్యాల మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొడాలి రమేష్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్ ఏ మతీన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించిన, ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుండెపోటు కారణంగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించి, అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఎన్నికల ఇంచార్జి దేవీప్రసాద్ గారు సీనియర్ నాయకులు నామ రవికిరణ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు . తదితరులు పాల్గొన్నారు,

అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

అయ్యప్ప దేవాలయంలో నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్పస్వామి దేవాలయంలో 25 వ మండల పూజల వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నది.అన్నదాతలుగా వరంగల్ పట్టణ కలకోట వెంకటేశ్వరరావు కుమారుడు, కోడలు ఫని కుమార్, డాక్టర్ శీతల్ వ్యవహరించారు.అలాగే సింగిరికొండ సురేష్ విజయ దంపతుల వివాహ పర్వదిన సందర్భంగా రూ.2 వేలు విరాళంగా అందజేసినట్లు దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు,ఆలయ పూజారులు,గురుస్వాములు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

వెంకటాపూర్ మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గంప సుమలత ఇల్లు షార్ట్ షర్కూట్ వల్ల కాలిపోగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క వారి కుటుంబానికి దైర్యం చెప్పారు
పూర్తిగా ఇల్లు దగ్ధం కావడంతో వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి వారి కుటుంబానికి బియ్యం, దుప్పట్లు,దుస్తులు అందించ ఆర్థిక సాయం చేశారు
మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version