ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

శుక్రవారం భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల ఎలుగుల సురేష్ , ఎలుగుల చందు ఇరువురు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు నాణ్యమైన వైద్యం అందించుటకు నావంతు సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలోని మున్సిపాలిటీ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న జంగేడు–భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు.
ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారికీ శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.
వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అందరూ ఒకే వేదిక పై కలవడం ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గత స్మృతులను గుర్తుచేసుకునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఇట్టి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..
ఈ కార్యక్రమం ద్వారా మరింత క్రమశిక్షణ, స్నేహభావం పెరుగుతాయని అన్నారు.
ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version