మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
భూపాలపల్లి నేటిధాత్రి
గోరుకొత్తపల్లి మండలం చేన్నాపూర్ గ్రామం గ్రామానికి చెందిన ఏరుబటి మల్లాజి ఇటీవల మృతి చెందాడు విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైనారు అనంతరం స్నేహితులు అందరూ కలిసి లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో వారి కూతురు పేరుమీద ఫిక్సింగ్ డిపాజిట్ చేసి పిక్స్ డిపాడ్ చేసిన బాండును వారి కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు స్నేహితుల అందరికీ కృతజ్ఞతలు తెలిపినారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు గ్రామస్తులు పెద్దలు అందరూ పాల్గొన్నారు
