.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2000- 2001 పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు కరీం పాషా తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా మిత్రులందరు కలసి పదివేల ఆర్థిక సాయంను అందించారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుల కుటుంబాల్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగిన తమ వంతు సహాయం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కొమ్ముల భాస్కర్, శ్రావణ్, రమేష్ , చందర్ , దేవేందర్ , రమేష్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు.
