దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత.

దశదినకర్మలకు ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
ఆదివాసి జేఏసి ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పోలేబోయిన సుశీల దశదిన కర్మలకుగాను ఆదివాసి జేఏసీ, మరియు దాతల సహాయార్థం 125kg ల బియ్యం, 15kg నూనె ఇవ్వటం జరిగింది. అలాగే తన వంతు సహాయంగా మన మండల రెవిన్యూ భూభారతి ఆపరేటర్ చందా కౌసల్య 6,500 రూపాయలు నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకట నారాయణ గారు, మాజీ సర్పంచులు పాయం నర్సింహారావు గారు, పోలేబోయిన పాపక్క ,ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, పోలేబోయినా సర్వేశ్వరావు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు పోలేబోయినా ప్రేమ్ కుమార్, కలం సంపత్, ఉకే నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, రాజశేఖర్, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి శస్త్రచికిత్సకు నీలి ప్రకాష్ ఆర్థిక సహాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-100-1.wav?_=1

చిన్నారి వైద్యానికి 10200 ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ లయన్ నీలి ప్రకాష్

నేటిదాత్రి చర్ల

మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నీలి ప్రసాద్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన విద్యార్థి బొడ్డు యశ్వంత్ కు అండగా పదివేల రెండు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పాత చర్ల నివాసితులు డోల కృష్ణయ్య మనవడైన ఎనిమిదవ తరగతి చదువుతున్న బొడ్డు యశ్వంత్ అనే ఈ విద్యార్థికి అనుకోని పరిస్థితుల్లో ఈ విద్యార్థికి కడుపునొప్పి రావడంతో భద్రాచలం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అప్పులు చేసి ఆ కుటుంబం సర్జరీ చేయించారు హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితులో మీకోసం మేమున్నాం సంస్థను ఆశ్రయించగా సంస్థ చైర్మన్ నీలి ప్రకాష్ పలువురు దాతల సహాయంతో పదివేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చైర్మన్ నీలి ప్రకాష్ చేతులు మీదుగా మరియు కట్ట అమ్మాజీ చేతుల మీదుగా కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు భరోసాగా ఉండేందుకు మా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని ఇప్పటివరకు ఇలా సుమారు 1000 సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంలో సంస్థ సభ్యులు మరియు దాతల సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో దొడ్డ ప్రభుదాస్ కవ్వాల రాము దొడ్డి సూరిబాబు సోల్లంగి నాగేశ్వరరావు గాదె రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మాస్ సంస్థ బిద్దు విద్యార్థికి ఆర్థిక సాయం అందించింది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T151832.193-1.wav?_=2

 

దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…

వర్దన్నపేట (నేటిధాత్రి ):

 

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152052.705-1.wav?_=3

 

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం…

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హత పొందిన పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పంట సాగులు, గొర్రెల గేదెల షెడ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అడిషనల్ పీడీ రేణుక, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, డిసిసి కార్యదర్శి హరిప్రసాద్, సాయి కృష్ణ, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, బండి శివకుమార్, రావుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, ఉడుగుల అశోక్, వడ్డె ఏకాంబరం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో నిరుపేదలకు సీఎం సహాయనిధి పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T131500.204.wav?_=4

నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

పేదలకు గోపవరం సీఎం సహాయనిధి.

పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి:
-ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.

వర్దన్నపేట( నేటిదాత్రి )

వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.

సిఎంఆర్ చెక్కుల పంపిణీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-65-2.wav?_=5

 

సిఎంఆర్ చెక్కుల పంపిణీ

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ) రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎనబై నాలుగు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నలభై వేల ఐదువందల విలువైన చెక్కులు అందించారు. ఈసందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలి పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, మాజీ సర్పంచ్ కొల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, రాజమల్లయ్య,బాల గౌడ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ చంద్రారెడ్డి,నరేందర్ రెడ్డి, డైరెక్టర్ స్వామి, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, కనకయ్య, అంజయ్య, రాజేశం, మల్లేశం, బాపురాజు, మధు, రాంరెడ్డి, మనీష్, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T144213.303-1.wav?_=6

 

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వితరణ.

#గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి సర్వర్ అనారోగ్యంతో మృతి చెందగా. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో బుధవారం మృతిని స్వగృహానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట నాయకులు కొండి అశోక్, పరికి పవన్, మురికి రవి, భాష బోయిన సమ్మయ్య, కొత్త పెళ్లి రమణ చారి, గాజు బిక్షపతి, కనుకo సాల్మన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన హనుమాండ్ల కుటుంబం..

పాలకుర్తి నియోజకవర్గ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన హనుమాండ్ల కుటుంబం

ఈ ప్రాంత అభివృద్దే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి కుటుంబం సదాశయం

మరోసారి తమ చేతలతో నిరూపించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఒక హృద్యమైన కార్యక్రమం జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, వారి కుటుంబం ఒక సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన 14 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం మొత్తం రూ.4,84,000 విలువైన చెక్కులను వారి కుటుంబాలకు అందజేశారు..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందించారు. నిరుపేద విద్యార్థులు చదువు ఆపకుండా ముందుకు సాగాలని, తమ సపోర్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. విద్య మాత్రమే సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలవడం తమ కుటుంబం యొక్క ప్రధాన బాధ్యత అని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

తాము ఈ ప్రాంతానికి రుణపడి ఉన్నామని, ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమకు శక్తినిస్తాయని ఆమె అభివర్ణించారు. నేను చేస్తున్నది దాతృత్వం కాదు, నా కుటుంబానికి చేస్తున్న బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, ఒక తల్లి హృదయంతో సమాజంలోని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో విద్యా అభివృద్ధి పట్ల కుటుంబం ఎంత అంకితభావంతో ఉన్నామో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.. మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతీ విద్యార్తి చదువుకోవాలి, ఎవరూ ఆర్థిక సమస్యల వలన వెనుకబడి పోకూడదు. ఇందుకు కావాల్సిన సహాయం, ప్రోత్సాహం అందించడంలో మా కుటుంబం ఎప్పటికీ ముందుంటుంది. పాలకుర్తి అభివృద్ధి మా బాధ్యత మాత్రమే కాదు, మా జీవిత ధ్యేయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరుపేద విద్యార్థులు, వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోతుందనే ఆందోళనలో ఉన్నామని, ఇప్పుడు కొత్త ఆశలు కలిగాయని వారు పేర్కొన్నారు. కొందరు తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటూ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంతటి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపన తర్వాత విద్యా రంగం, ఆరోగ్య రంగం, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ట్రస్ట్ చేస్తున్న కృషి పాలకుర్తి ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తోంది. గతంలోనూ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించిన ఈ కుటుంబం, ఈసారి కూడా ఆర్థిక సాయం అందించడం విశేషం. విద్యా హక్కు ప్రతి పిల్లవాడికి లభించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబం చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలు కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమరాజశేఖర్ మాజీ కౌన్సిలర్ భూసాని రాము బసవ బోయిన రాజేష్ యాదవ్ హనుమండ్ల దేవేందర్ రెడ్డి చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటీ నాగిరెడ్డి కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని, విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42.wav?_=7

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు.
నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.

Collector Sandeep Kumar Jha

 

1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేటలోని రామకృష్ణ జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్ మరదలు రాజుపేట గ్రామం కీ.శే.కోతి స్వామి-అరుణ గౌడ్ దంపతుల కూతురు రచన -అబిలాష్ గౌడ్ ల వివాహం సత్యం ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగింది.ఈ వివాహ వేడుకకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వాదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు, మల్లంపల్లి గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్, రాజుపేట గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,నర్సంపేట గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ కక్కెర్ల అశోక్ గౌడ్, మల్లంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కేర్ల రాజు గౌడ్,కక్కేర్ల రాజు గౌడ్, మాజీ కోశాధికారి కక్కేర్ల కుమారస్వామి గౌడ్, కక్కేర్ల రాములు గౌడ్ తదితరులు హాజరైనారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం తిరుమలాపూర్* గ్రామానికి చెందిన పెండ్లి రవి ఇటీవల మరణించగా నేడు వారి నివాసాలకు వెళ్లి పెండ్లి రవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేశారు.అదే గ్రామానికి చెందిన కంచు చంద్రమ్మ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి రవి, యూత్ అధ్యక్షుడు రాంబాబు, చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షులు అల్లం రాజు, కొత్తపల్లి రాము గోపగాని శివకృష్ణ, గోల్కొండ మహేష్, ఎలగొండ చిరంజీవి, గోపగాని వెంకటేశ్వర్లు, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, కంచు తిరుపతి, గొర్రెటి ఓదెలు, గద్దల తిరుపతి, జన్నె జనార్ధన్, కలవేన ప్రవీణ్, నగరపు సాయి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version