మాజీ ఎంపీటీసీ కుటుంబానికి ఆర్ధిక సహాయం
రూ.50 వేలు ఆపన్నహస్తం అందించిన మాజీ జెడ్పీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్
నర్సంపేట,నేటిధాత్రి:
ఇటీవల గుండెపోటుతో మరణించి దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయి కుమార్ దశ దినకర్మ సోమవారం దేశాయిపల్లి గ్రామంలో జరగగా వారి కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి ఉండే వ్యక్తి ఆకస్మాతుగా మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయిన సాయి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ గా చేసిన సేవలను గుర్తుంచుకొని మానవతా దృక్పధంతో పార్టీలకు అతీతంగా శంబయ్యపల్లి గ్రామస్తులు స్వచ్చందంగా ముప్పై ఒకవెయ్యి ఆరువందల రూపాయలను సేకరించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటుగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు వంగేటి అశోక్ కుమార్, పెండ్యాల రాజు ఇరువురు కలసి ముప్పై ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.