బాధిత కుటుంబనికి భరోసాగా నూతన సర్పంచ్
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగ్గుoపుకు చెందిన మల్లెల లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, వార్డు సభ్యులతో కలిసి మృతుని ఇంటికి చేరుకున్నారు. లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దశదిన కర్మల నిర్వహణ కోసం తన వంతు సాయంగా 50 కిలోల బియ్యం ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని సర్పంచ్ భాగ్యమ్మ, వార్డు సభ్యులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
