మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download.wav?_=1

 

మృతురాలి కుటుంబాన్ని పెండెం రామానంద్ పరామర్శ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణం 23 వ వార్డుకు చెందిన వరంగంటి బుచ్చమ్మ మరణించగా ఆమె మృతదేహంపై టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవండ్ల రాంబాబు, 23వ వార్డు అధ్యక్షుడు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు అధ్యక్షుడు కోల చరణ్ గౌడ్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేల్లి సారంగం గౌడ్, మాజీ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొలువుల వెంకటేశ్వర్లు, దూడేల సాంబయ్య, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్, గద్ద వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మల్లేష్..

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మల్లేష్

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎం ఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మాదారం గ్రామంలో ఆదివాసి గిరిజన జిల్లా నాయకుడు దయ్యం పోచయ్య అమ్మగారైన దయ్యం మానుతమ్మ ఇటీవలే మరణించడం జరిగింది తొమ్మిదవ రోజు కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అమ్మకు
ఆత్మ శాంతి చేకూర్చాలని వేడుకున్నారు యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు హక్కుల బాబు యాదవ్ ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లయ్య గుంటి లక్ష్మి గుంటిరామయ్య లాస్య దెయ్యం బక్కయ్య రాజేష్ ఆదివాసి నాయకులు పాల్గొన్నారు

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి..

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రవి, శ్రీనివాస్ ల తండ్రి భాషబోయిన ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుడు ఐలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టి పి సి సి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల మధు ముదిరాజ్, నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మట్ట రాజు, భాషబోయిన పాపయ్య, సల్పాల ప్రభాకర్, జగన్మోహన్ రావు,ఆదిరెడ్డి, ఓర్సు తిరుపతి,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం
గాంధీనగర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన స్వర్గస్తులైన కీర్తిశేషులు కీర్తి శ్రీకాంత్ దిన కర్మ కు హాజరైన భూపాలపల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్ మాజీ తాజా సర్పంచ్ మాధం మమత – సుధాకర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతరాజు సురేష్, కాంగ్రెస్ నాయకులు గుడ్డేటి సురేష్, కడారి సుమన్, వేంపటి సురేందర్, పల్లెవెని రాజయ్య,బోల్ల భిక్షపతి, తుముల కుమార్, బొళ్ళశంకర్,కీర్తి శంకర్,కీర్తి భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు ప్రమోద్,అందరు కలిసి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సాయం 2500 రూపాయలు అందించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఆదుకొని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు

మృతిరాలి కుటుంబమును పరామర్శించిన..

మృతిరాలి కుటుంబమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల మాజీ వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సతీమణి కృష్ణవేణి తల్లి మంతెన వెంకట లక్ష్మీ ఇటీవల మరణించగా హుస్నాబాద్ లోని వారి నివాసంలో వెంకటలక్ష్మీ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించినారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T141610.925.wav?_=2


శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం గంగిరెణిగూడెం గ్రామానికి చెందిన గుగులోతు మాన్య నాయక్ మరణించగా, వారి చిత్ర పటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాంశెట్టి లత లక్ష్మారెడ్డి మాజి సర్పంచ్ శానంమంజుల పరమేష్, జాలిగాపు అశోక్, గండి రాజయ్య,పోతు రమేష్, శానం కుమారస్వామి, దాసరి రాజు, శ్రీపతి అశోక్, శానం నరేష్,గుగులోతు రమేష్, మల్రాజ్ జితేందర్, మహమ్మద్ మగ్దూన్ పాషా, శోభన్, రాజు, ఇర్యానాయక్ పాల్గొన్నారు.

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం.

చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

◆:-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

◆:-వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా అధ్యక్షులు బి.రామచందర్

జహీరాబాద్/ఝరాసంగం:వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామచందర్, మాట్లాడుతూ ఝరాసంగం మండలం చీలపల్లి గ్రామంలో మూడు నెలల వేతనాలు రాకపోవడం, అధికారుల ఒత్తిళ్లు వలన కుంగిపోయి చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.ఫీల్డ్ అసిస్టెంట్లకు అధిక పని భారం పెట్టి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వలన కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది అని ప్రభుత్వం వెంటనే బకాయిలు ఉన్నటువంటి వేతనాలను చెల్లించి ఫిల్ అసిస్టెంట్లను ఆదుకోవాలని వారు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రన్న, ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షులు ఈశ్వరప్ప పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

స్విమ్స్ లో చనిపోయిన తల్లి నేత్రలు దానం..

స్విమ్స్ లో చనిపోయిన తల్లి నేత్రలు దానం –

కందారపు కుటుంబ సభ్యులు.

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 11:

ఎస్వీ వైద్య కళాశాల, స్విమ్స్ ఆసుపత్రి లో కందారపు. రాజమ్మ అనారోగ్యం తో చికిత్స పొందుతూ మరణించారు, చనిపోయిన కందారపు
రాజమ్మ సుమారు 80 సంవత్సరాలు , యశోద నగర్, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్విమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది.ఆమె కుమారులు కందారపు .మురళి, కందారపు
సురేంద్ర తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది.
రుయా కంటి విభాగము విభాగాధిపతి డాక్టర్. చలపతి రెడ్డి అధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది,
నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి కుమారులు సమ్మతితో ఆమై నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్,రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది.తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు, ముందుకు రావడం,
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నదిఅని నేత్ర విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి తెలిపారు. రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జే. రాధా మాట్లాడుతూ
వారి కుటుంబ సభ్యులు,ఈ విధంగా ప్రభుత్వ వైద్యశాలలకు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వలన పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితముగా అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రిందిఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును.
సెల్ నెంబర్: 8500880126,ఈ కార్యక్రమంలో ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్,
రమేష్,మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.
వీర కిరణ్ పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం

మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం పందిపంపుల గ్రామంలో అవులు కాపరి నద్దునూరు రవి మృతి చెందాడువిషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దామెర రమేష్ ఆ కుటుంబానికి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు అనంతరం 25 కేజీల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం ధామెర రమేష్ మాట్లాడుతూ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వాటన్నిటికీ తట్టుకోని ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోకూడదని వారు సూచించారు మృతుడి కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఆర్థిక సహాయ చెయ్యాలి ఇందిరమ్మ ఇల్లు అలాగే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. పార్టీ సభ్యులు ముక్లోత్ ప్రకాష్ . ఎల్లబోయిన సాగర్ చీపురు శీను, కారం రాకేష్, నరేష్, ముప్పిడి గణేష్, గట్టయ్య, కుంజం రాజు, తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

దుర్గం అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో నోముల సంపత్ తల్లి ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ దుర్గం రాజ సమ్మయ్య నేతకాని సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు గజ్జ రాజ్ కుమార్ కాంగ్రెస్ యూత్ నాయకులు వినయ్ బోడికల సంపత్ నరేష్ యాదవ్ అశోక్ చందు దుర్గం అనిల్ తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి

ఐనవోలు నేటిధాత్రి:

ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లోని చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కంచర్ల రాంబాబు గారి తండ్రి (కంచర్ల పోశాలు) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్నిగురువారం చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* పరామర్శించి వారి ఆత్మకు మనస్పూర్తిగా శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ సీనియర్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.

మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీపీ.

మృతుడి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మైలారo గ్రామంలో భూపాల పల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు శాయంపేట మండలం మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ సోదరుడు కీ!!|శే అరికిళ్ల ప్రవీ ణ్(ఆర్మీ)నిన్న మరణించగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి ప్రవీణ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థిస్తూ వారి కుటుం బానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు.ఈ కార్యక్రమంలో రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, దాసి శ్రావణ్ కుమార్, సౌల్ల కిష్ట య్య, నర్ర రాజు, అర్జల సాంబ రెడ్డి, కొమ్ముల శివ,కుతాటి రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి పట్టణంలో నీ సుభాష్ కాలనీకి చెందిన పులిగంటి రమేష్ గత వారం క్రితం గుండెపోటుతో మృతి చెందాడు గురువారం భూపాలపల్లి పట్టణానికి చెందిన పూర్వ పాఠశాల రాహుల్ విద్యానికేతన్ కు చెందిన తోటి మిత్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లట్ట రాజబాబు ,ఉపాధ్యాయులు. లట్ట వెంకటేష్, మేడ వెంకటస్వామి. మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు మొదటి కుటుంబ సభ్యులకు రూ. 25 వేల తో పాటు 50 కిలోల బియ్యం ఇతర నిత్యవసర సరుకులు అందించారు.. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మిత్రులు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు దుండ్రా.కుమార్ యాదవ్, గాదం రాజు, అల్లెపు సతీష్, చెక్క గోపి. నాన్డ్రి కమలాకర్ ,. బి కొండ నరేందర్ , ఏలుగుల సురేష్ , బొల్లం నరేష్, పూల్యాల తిరుపతి, ఎలాకంటి విజయ్, కాలనీ వాసులు కొడపాక శంకర్, రఘుపతి తదితరులుపాల్గొన్నారు

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

shine junior college

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బంట్రోజు లక్ష్మీపతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి పరామర్శించి నా వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారుఈ o దుకుగాను వారి కుటుంబ సభ్యులు బియ్యం అందజేసినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కృష్ణారెడ్డి. తిరుపతి. మనోజ్
శ్రీనివాస్ గౌడ్. నర్సింలు తదితరులు పాల్గొన్నారు

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం

మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి

మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న
మొగులపల్లి నేటి ధాత్రి:

 

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే ఇదొక దురదృష్టకరమైన సంఘటనని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఏకంగా విమాన ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది, విమానం ఒక మెడికల్ కాలేజీ పై కూలడంతో ఎంతోమంది విద్యార్థులు క్షేత్రగాత్రులు అయ్యారని, మరికొంతమంది విద్యార్థులు మరణించారని, ఇలా ఇంతమంది ఒకే ప్రమాద దుర్ఘటనలో మరణించడం మనదేశంలో ఇదే ప్రథమమని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భారతీయులంతా ఒక్కటై బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని, ఇందుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని, ఎన్నో ఆశలతో విమానంలో బయలుదేరిన వారు తమకు తెలియకుండానే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మోటే ధర్మన్న వేడుకుంటున్నట్లు తెలిపారు.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన ఎస్ఎన్ పిసి సింగరేణి కార్మికుడు నేరుపటి మొగిలి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న తోటి కార్మికులు 83 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నేరుపటి మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని కార్మికులు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ రావు సీనియర్ ఇన్స్పెక్టర్ జగ్గ లక్ష్మి రాజ్యం కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

 

శనివారం కల్వకుర్తి మండలం లోని తర్నికల్ గ్రామానికి చెందిన వర్కాల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తర్నికల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ రుక్ముద్దీన్, మాజీ వార్డు సభ్యులు దేవయ్య, మాణిక్యరావు, వెంకటరత్నం, కృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version