డైవర్షన్‌ పాలిటిక్స్‌లో డేరింగ్‌ కింగ్‌

-డైమనిక్‌ పాలిటిక్స్‌లో ఆరి తేరిన లీడర్‌!

-ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడు.

-రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు.

-ఎవ్వరి సలహాలు తీసుకోడు.

-తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు.

-తన నిర్ణయాలు వెంట నడిచే వారిని వదులుకోడు.

-ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు.

-రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు.

-అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు.

-ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడు.

-రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు.

-తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు.

-ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు.

-రెండేళ్ళలలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు.

-తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు.

-మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోగలడు.

-ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు.

-రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దటీజ్‌ రేవంత్‌ అనిపించుకోగలడు.

-రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి.

-ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

డైవర్ట్‌ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాలలో వాళ్లే కింగ్‌లౌతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్‌ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికీ నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకొని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్షన్లు, డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడలాంటే లాజిక్‌ల కన్నా మ్యాజిక్‌లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త దనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడు విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీమ్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పైఎత్తులలో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే..గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని నాలుగు మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు వుంచుతామనే మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించి గోల్‌ కొట్టాలి. ఒక్కసారి వెనుకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా, వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్‌ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు, వ్యూహాలు ఆది నుంచి అనుసరిస్తూ, ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్‌ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆయన అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్దాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్‌గా డైవర్షన్‌ పాలిటిక్స్‌లో కింగ్‌ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్‌ కాదు. గెలిచారా లేదా? అన్నదే కీ పాయింట్‌. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి సక్సెస్‌కు కేరాఫ్‌గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరి తేరిన నాయకుడనిపించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అసమ్మతి నుంచి సమ్మతి పొందిన నాయకుడై వెలుగొందుతున్నారు. బరి గీసి నిలబడి, ఎదురించి నిలబడి విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దటీజ్‌ రేవంత్‌ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు వుండొచ్చు. అభిప్రాయ బేధాలు పొడసూపొచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యం అసలే కాదు. అందుకు అకుంఠిత దీక్ష అవసరం. కష్టాలు, నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నిటికన్నా గుండె నిబ్బరంగా వుండాలి. కష్టాలను చిరు నవ్వు తో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలుపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినను అనే రాజకీయాలు చేయడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతగా వుండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావొచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అందుకే రేవంత్‌ వేసిన స్కెచ్‌కు ఎదురుండదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అటు కేసిఆర్‌ ను పదే పదే రెచ్చగొట్టి, మీడియా అటెన్షన్‌ అంతా తనవైపు తిప్పుకునే వారు. పిసిసి అధ్యక్షుడుగా వున్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా వున్నది లేదు. కేసిఆర్‌ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్‌ బాదితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచే రాజకీయం చేసినా ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచి తనం రేవంత్‌ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్‌ రెడ్డి ని ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తుల మధ్య వుండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజులలో రాజకీయాలలో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని రేవంత్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్‌ ఫాదర్‌ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్‌ లా అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాలనుంచి వెంటనే బైట పడగలిగే శక్తి వున్న నాయకుడగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతే కాదు రెండేళ్ళుగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడు కూడా ఒక మాట అనడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నాడు. గతంలో కేసిఆర్‌ ఉద్యమ కాలంలో ఎంతటి వారినైనా సరే చీల్చి చెండాడే వారు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నాడు. ఎందుకంటే తనను తిట్టిన బిఆర్‌ఎస్‌ను ఓడిరచి గెలిగిన ధీరుడు రేవంత్‌ రెడ్డి. తన పాలనలో ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎదురైన అనేక సమస్యలను క్షణాలలో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ వస్తున్నాడు. రెండేళ్ళలలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. దానిని వివాదం చేయాలని బిఆర్‌ఎస్‌ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్‌ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్‌ దంటూ బిఆర్‌ఎస్‌ ను దబాయించారు. ఆఖరుకు ఆ పాపం కూడా బిఆర్‌ఎస్‌ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు బిఆర్‌ఎస్‌ సుంకిశాల మీద మాట్లాడిరది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్‌ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పకతప్పదు. ఆ మధ్య ఎస్‌ఎల్బీసి టన్నెల్‌ వ్యవహారం ఎటు పోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కాకపోవడానికి కూడా కేసిఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. కేవలం కేసిఆర్‌ చేసిన అప్పుల మూలంగా నెల నెల మిత్తీలకే 6 వేల కోట్లు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రజలను నమ్మించి పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం చేసిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. రాజకీయంగా తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో వుంచగలడు. మీడియా అటెన్షనంతా తనపైనే ఫోకస్‌ చేసుకోవడంలో రేవంత్‌ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలెప్పుడూ సక్సెస్‌ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్‌ కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T164829.319.wav?_=1

 

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిమండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డిహాజరై వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు.రైతులకు ఎరువులు సమయానికి అందకపోవడం వల్ల పంట నష్టాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకువచ్చి, ఎరువుల సరఫరా నిరవధికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి మండల రెవెన్యూ అధికారి గారికి ఈ విషయాన్ని తెలియజేసాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరాం,” అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.అలాగే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ జిల్లా ఉపధ్యక్షుడు బొడ నరసిహ్మ పట్టణ అధ్యక్షులు బబిదేవ్ జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు రహ్మతులా, pacs వైస్ చైర్మన్ శ్యాంసుందర్, గoగధర్,మండల ప్రధాన కార్యదర్శులు బచలకుర శ్రీశైలం,శ్రీను,ముదిరాజ్ నప శివ, ఉపాదేక్షులు బాలకృష్ణ, రాజశేఖర్, పానుగంటిశివ,మంద రజురెడ్డి, లిoగారెడ్డి,నాగరాజు,సురేష్ గౌడ్, వెంకటేష్, వినయ్ రెడ్డి, అంజనేయులు,అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=2

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-72-3.wav?_=3

TPCC ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీను అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
*బర్ల సహాదేవ్ అడ్వకేట్
వర్దన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి

https://youtu.be/mgl8GBmGx0A?si=17Xm63Mz8snnwWrL

వర్దన్నపేట (నేటిధాత్రి):

యువతకు మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అని అంటే కష్ట కాలంలో నేనున్నా అని భరోసా ఇచ్చే నాయకుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నమ్మిండ్ల శ్రీను అన్న గారు జన్మదిన శుభాకాంక్షలు
ప్రజలతో కలసి మమేకమై ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ, ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ, నిజాయితీతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తూ, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తూ ప్రజా హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.
నమ్మిండ్ల శ్రీను అన్న గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాకుండా ప్రజల ఆపదలో అండగా నిలిచే సహృదయుడు, యువతకు మార్గదర్శి. ఆయన సేవా తపన, దూరదృష్టి, కష్టసుఖాలలో అందరితో కలసి నిలబడే ధైర్యసాహసాలు ఈనాటి రాజకీయాల్లో అరుదైన లక్షణాలు.
ఆయన పాదయాత్రలు, ప్రజల సమస్యలపై పోరాటం, బడుగు బలహీన వర్గాల కోసం చేసే కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆయనలాంటి నాయకుడు మన వర్ధన్నపేట నియోజకవర్గానికి దక్కడం గర్వకారణం.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను

కొత్త రేషన్ కార్డులను పంపిణీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T135201.153.wav?_=4

 

కొత్త రేషన్ కార్డులను పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104227.530.wav?_=5

 

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్ శనివారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్బంగా రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ వైస్ ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

బాoసేప్ 12వ మహాసభలను విజయవంతం చేయండి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో బాంసేఫ్ ప్రచారకులు, బాంసేఫ్ 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాంసేఫ్ అధ్యక్షులు నరేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాదారిక జనగణన చేస్తామని ప్రకటించిన కులాదారిక జన గణన చేపట్టకపోవడం ద్వారా ఓబిసి ఎస్సి, ఎస్టీ కులాల ప్రజలను మోసం చేస్తున్నాయని వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈవీఎంల విషయంలో మౌనాన్ని పాటించడం ద్వారా అవకతవకలు పాల్పడడం బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని ఒకటి సహకరించుకుంటున్నాయని ఆయన ఎద్దేవ చేశారు. తాము పుట్టిన సమాజ అభివృద్ధి కొరకు తమ బానిసత్వాన్ని వదిలించుకోవడం తమ ధనాన్ని తమ అజ్ఞానాన్ని తమ సమయాన్ని వెచ్చించిన వారు ధన్యులు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, టి ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్,
అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కొత్తల గంగారం,
భారతీయ యువ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇల్లిందల ప్రభాకర్,
భారత ముక్తి మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గడ్డం రవి,నర్సింలు నిజాంపేట్ మండల డిబిఎఫ్ ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు,వడ్డెర సంఘం మైశయ్య,మల్లయ్య,మైనార్టీ నాయకులు సమీర్, సలీం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=6

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో పరామర్శ కార్యక్రమం…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

తొర్రూరు పట్టణంలో శ్రద్ధాంజలి, పరామర్శ కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణంలోని 16వ వార్డుకు చెందిన గుర్రాల మధుకర్ రెడ్డి కుమారుడు సాయి నవనీత్ రెడ్డి ఇటీవల మృతిచెందగా, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

తదనంతరం, పట్టణంలోని 2వ వార్డులో సీతమ్మగారు ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

Condolence Meet in Torrur

ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమరాజ శేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, తునం శ్రావణ్, బసనా బోయిన రాజేష్ యాదవ్, చెవిటి సుధాకర్, అలాగే పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-64-1.wav?_=7

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.

రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల నేటి ధాత్రి

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

MLA Janampally Anirudh Reddy.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు

తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.

వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ

జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు

 

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.

మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.

సామాజిక స్పృహకు అద్దం
కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు.
తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

బీహార్ ఓటర్ లిస్ట్ వివాదంపై కఠినంగా స్పందించిన ఎన్నికల సంఘం..

బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.
ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ – “ఎన్నికల దోపిడీ ఆరోపణలు భారత రాజ్యాంగానికి అవమానం” అని హెచ్చరించారు.

అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే ఓటర్ల జాబితాలో మార్పులు చేయడానికి SIR చేపట్టామని ఆయన తెలిపారు. మొత్తం 1.6 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీల ప్రతినిధులు కలిసి డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేశారని స్పష్టం చేశారు.

“గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి హానికరం” అని గ్యానేశ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ‘వోటర్ అధికారం యాత్ర’ ప్రారంభం.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సాసారాం నుండి ప్రారంభించిన ‘వోటర్ అధికారం యాత్ర’ లో భాగంగా 16 రోజులు, 1,300 కిలోమీటర్ల పయనం చేపట్టారు. రాహుల్ గాంధీ అన్నారు, “బిహార్‌లో ఎన్నికను ఎవరు చోరీ చేయనీయకుండా జాగ్రత్త పడతాం.” ఈ యాత్రలో RJD నేత తేజస్వి యాదవ్ మరియు INDIA బ్లాక్ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. యాత్రలో 20 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేసి సెప్టెంబర్ 1న పట్నాలో పెద్ద ర్యాలీతో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ప్రకారం, ఈ యాత్ర ప్రతి వ్యక్తికి ఒక్క ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామిక హక్కును రక్షించడానికి నిర్వహించబడుతోంది.

బీహార్‌లో రాహుల్ గాంధీ ‘వోటర్ అధికార్ యాత్ర’ ప్రారంభం..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లోని ససారం నుండి తన 16 రోజుల ‘వోటర్ అధికార్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం 1,300 కిలోమీటర్లు, 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇది ప్రతీ వ్యక్తి ఓటు హక్కును కాపాడే, భారత రాజ్యాంగాన్ని రక్షించే సమరం అని పేర్కొన్నారు.
రాజసత జనం దళం (RJD) నేత తేజశ్వి యాదవ్ మరియు ఇతర INDIA బ్లాక్ పార్టీలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర సెప్టెంబర్ 1న పట్నాలోని మెగా ర్యాలీతో ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకారం, రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా భారతీయ ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని సమాచారం కోసం మన నేటిధాత్రి ఛానెల్‌ను ఫాలో చేయండి.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

లీడర్లు అటు..క్యాడర్‌ ఇటు!

`తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం.

`గతంలో నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు కదిలేవారు.

`ఇప్పుడు నాయకులు మాత్రమే కొత్త దారి వెతుక్కుంటున్నారు.

`బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు కారు దిగుతున్నారు.

`ఇతర పార్టీల నుంచి నాయకులు కారెక్కుతున్నారు.

`కారు దిగుతున్న నాయకులతో మేం రామంటున్నారు.

`అధికారంలో వున్న కాంగ్రెస్‌ వైపు కార్యకర్తలు ఎందుకు చూడడం లేదు!

`కాంగ్రెస్‌ లో కొత్త వారిని కలుపుకుపోరన్న భయమా!

`ఇప్పటికే రెండేళ్ళు గడిచింది.. పార్టీ మారితే ఒరిగేముందన్న భావనా?

`బీఆర్‌ఎస్‌ లో కూడా కార్యకర్తలు అసంతృప్తిగానే వున్నారు.

`అయినా కారు దిగి జారుకోవడానికి సిద్ధంగా లేరు!

`ఇతర కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా లేదు.

`గువ్వల బాలరాజు మీటింగ్‌ తో కొంత తేట లెల్లమైంది.

`మేం రామని తెగేసి చెప్పినట్లైంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అటు లీడర్‌..ఇటు క్యాడర్‌! తెలంగాణలో విచిత్రమైన రాజకీయ వాతావరణం. పార్టీలు మారుతున్న నాయకులతో క్యాడర్‌ రావడం లేదు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా క్యాడర్‌ కదలేదు. ఏ ఎమ్మెల్యేతో పట్టు పని పది మంది వెళ్లలేదు. వెళ్లినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పొసగడం లేదు. తమతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు వస్తారని, రావాలని కూడా ఎమ్మెల్యేలు అనుకోలేదు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన ఏ ఎమ్మెల్యే కూడా దర్జాగా కండువా కప్పుకోలేదు. గతంలో ఈ పరిస్దితి భిన్నంగా వుంది. కాంగ్రెస్‌ నుంచి గాని, తెలుగుదేశం నుంచి గాని బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరిన క్రమంలో పెద్ద పెద్ద ర్యాలీలు. వందల కార్లు కాన్వాయిలు. గులాబీలు. జెండాలో అబ్బో అదో పెద్ద సెటప్‌తో వెళ్లేవారు. జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులతో చేరి, కండువాలు కప్పుకున్నారు. కండువాలు కప్పే నాయకులు కూడా ఇంకా వున్నారా? అని ఎదురుచూసిన పరిస్దితి కనిపించేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు చాలానే చేరారు. కాని వారి వెంట క్యాడర్‌ పెద్దగా కదిలినట్లు లేదు. వందల మంది చేత వచ్చి కాంగ్రెస్‌లో కలిసిన నేతలు లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరి, కండువా కప్పుకొని, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ వెంట కూడా జనం వెళ్లలేదు. క్యాడర్‌ ఆయనతో కదలేదు. ఆయన అదృష్టం పాత పరిచయాలు ఆయనకు దానంకు పనికి వస్తున్నాయి. వ్యతిరేకతకు తావు లేకుండా చేస్తున్నాయి. కాని మిగతా ఎమ్మెల్యేలందరికి మాత్రం విచిత్రమైన వాతావరణమే వుంది. ఇందులో కడియం శ్రీహరి లాంటి నాయకుడు గతంలో తెలుగుదేశంలో వున్నంత కాలం బలమైన క్యాడర్‌ను మెంటైన్‌ చేశారు. తర్వాత పదేళ్లకాలం పాటు బిఆర్‌ఎస్‌లో కూడా బాగానే అధికారం చెలాయించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన జిల్లాకు, నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా మిగిలిపోయారు. ఆఖరుకు ఏ పార్టీలో వుండాలో ఆపార్టీలోనే వున్నానంటూ ముక్తాయించాల్సిన పరిస్ధితి తెచ్చుకున్నారు. కాకపోతే తన రాజకీయ చాణక్యంతో, చైతన్యంతో మాత్రం తన కూతురు కావ్యను ఎంపిని చేశారు. ఇది ఎంతైనా గొప్ప విషయం. రాజకీయాల్లో నైతికత అనే పదం ఈరోజుల్లో వాడడమే శుద్ద దండగ. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో వుండి, నైతికత గురించి మాట్లాడడం అంటేనే గొంగడిలో కూర్చొని అన్నం తిన్నట్లే లెక్క. పార్టీలు మారినా, తన రాజకీయ ప్రస్తానాన్ని దిగ్విజయంగా కొనసాగించిన నాయకులలో కడియంశ్రీహరి ఎంతైనా ప్రత్యేకమే. అందుకే ప్రత్యర్ధి రాజకీయాలు చేసినా, ఒకే పార్టీలో కలిసి రాజకీయాలు చేసినా ఆయన స్దానం ఎప్పుడూ నిలబెట్టుకున్నారు. అధికారం చెలాయించారు. ఇతరుల అదృష్టాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి నాయకుడు బహుశా దేశంలో కూడా లేకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు తనకు ఎదురులేకుండాపాలించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్ధి అదృష్టం లాగేసుకున్నారు. 2018 తర్వాత మంత్రి కాకపోయినా, సరే తన పాత్రలోకి ఎవరూ రాకుండానే చూసుకున్నారు. వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో తన దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండాచూసుకున్నారు. ఇంత పెద్ద నాయకుడైనా సరే ఇప్పుడు క్యాడర్‌ ను వెతుక్కొవాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయాలలో వున్న వారు ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో..వుండాలో అన్న దానిపై ఎవరి స్ధిర నిర్ణయం లేదు. నిలకడ అసలే లేదు. గాలి వాటం రాజకీయాలు. ఎందుకంటే గతంలో తన జీవితమంతా గులాబీతోనే అని అనేక సార్లు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పేవారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా వేరే రక్తం మనలో పారదు అని కూడా చెప్పారు. కాని అధికారం పోయింది. ఆయన ఓడిపోయారు. బిఆర్‌ఎస్‌లో తనను అనుమానంగా చూస్తున్నారు. మరో వైపు లెక్క చేయడం లేదు. మహబూబ్‌ నగర్‌ బిఆర్‌ఎస్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పెత్తనం ఎక్కువైపోయింది. పార్టీ కూడా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. తనను లెక్క చేయకుండా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాగే వుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా వచ్చే అవకాశం వుంటుందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మహబూబ్‌ నగర్‌ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒంటి చేత్తో లాగించుకొస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సామాజిక వర్గం, గువ్వల బాలరాజు సామాజిక వర్గం ఒకటే. అంతే కాకుండా అది రిజర్వుస్ధానం. రాజకీయ సమీకరణాలలో భాగంగా చూసుకున్నా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ లాంటి వారిని జనరల్‌ సీట్లో పోటీ చేయించే అవకాశం వుండదు. రిజర్వు స్ధానంలో బలమైన నాయకులను పెట్టిన పార్టీలే గెలుస్తుంటాయి. కడియం రాజకీయం కూడా అలాగే సాగింది. ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఆది నుంచి అక్కడినుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. గెలుస్తున్నారు. 2014లో పార్లమెంటుకు ఎన్నికైనా సరే వరంగల్‌ ఎస్సీ రిజర్వుడు నుంచే గెలిచారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా తన సొంత జిల్లా నుంచే పోటీచేయాలని చూస్తున్నారు. గతంలో ఆయన ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసి పొరపాటు చేశారు. ఇది పాత రోజులు కాదు. గతంలో నాయకులకు పార్టీలు సీట్లు ఇచ్చినా గెలిచేవారు. అలా చరిత్రలో చాలా మంది వున్నారు. ఇప్పటికీ వున్నారు. మల్లు భట్టి విక్రమార్క అసలు జిల్లా పాలమూరు. కాని ఆయన మధిరను ఎంచుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఇప్పుడు కొత్త నాయకత్వానికి ప్రజలనుంచి ఆ సహకారం అందేలా వుండేలా లేదు. ఉమ్మడి జిల్లా వరకు సరే,గాని జిల్లాలు దాటి వెళ్లి గెలవడం అంటే సాద్యమయ్యే పని కాదు. నాయకులు కొత్త దారితోపాటు సరికొత్త పంధాలో వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా కారు దిగి, కమలం గూటికి చేరిన గువ్వల బాలరాజుతో పెద్దగా నాయకులు వెళ్లలేదు. దాంతో చేరిక సభ కార్యక్రమంలో గువ్వల బాలరాజుతో బిజేపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వంద మందికూడా రాలేదని సభా సాక్షిగానే నవ్వుతూనే ఎద్దేవా చేశారు. పైగా వంద మంది జాయిన్‌ అయినప్పుడు అసలైన సభ్యత్వం ఇస్తామనే అర్దం వచ్చేలా చిన్న చెనుకు వదిలారు. కాని అది ఒక నాయకుడికి ఇబ్బందికరమే. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ నుంచి పెద్ద నాయకులు కారు దిగిపోతున్నారు. అదే సమయంలో జిల్లాలలో నాయకులతో సంబంధం లేకుండా పెద్దఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. అలా మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలలో ఇటీవల చాలా మంది చేరారు. సహజంగా ఒక నాయకుడు ఎటు వైపు వెళ్తే క్యాడర్‌ అటు వైపు వెళ్లడమే చూశాం. కాని కారు దిగుతున్న నేతలతో క్యాడర్‌ మేం రామని తెగేసి చెబుతున్నారు. మీరు వెళ్తే వెళ్లండి..మమ్మల్ని రమ్మకనండి అని ముఖం మీదే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి కార్యకర్తలు ఒకింత భయపడుతున్నారు. కాంగ్రెస్‌లో కొత్తవారిని కలుపుకుపోయే వాతారణం కనిపించడం లేదు. పార్టీ మారినా పనులు వస్తాయన్న నమ్మకం లేదు. పదవులు వస్తాయన్న ఆలోచన వారిలో అసలే లేదు. ఎందుకంటే పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి అండగా వుంటూ, సేవలు చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని కొత్త వారికి పెద్ద పీట వస్తుందన్న విశ్వాసం కలగడం లేదు. పైగా చేరిన ఎమ్మెల్యేల పరిస్దితే అలా వుంటే, చేరితే మా పరిస్దితి అంత కన్నా భిన్నంగా వుంటుందా? అన్న ఆలోచనలో బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ గులాబీ జెండాను వదలడం లేదు. పైగా కాంగ్రెస్‌, బిజేపిల నుంచి వస్తున్న వారిని వద్దని వారించడం లేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చేరే నాయకులు ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడాల్సిందే. కొంత కాలం గడిస్తే అందరూ కలిసిపోతారు. పోటీ పడి పనులు చేస్తారు. పార్టీకి మరింత బలమౌతారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా నిరుత్సాహం, అసంతృప్తిగానే వున్నారు. కాని కారు దిగడానికి, జారుకోవడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌లో పొసగలేరు. బిజేపిలో చేరినా గుర్తింపు, ప్రజల్లో ఆదరణ వుంటుందన్న నమ్మకం అసలే లేదు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఒక్క బిఆర్‌ఎస్‌ క్యాడరే మరో కండువా కప్పుకోవడానికి సిద్దంగా లేరు. ఇది మాత్రం నిజం.

వీడియోతో ‘వోట్ చోరి’పై కాంగ్రెస్ ఆగ్రహం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-32-3.wav?_=8

వీడియోతో ‘వోట్ చోరి’పై కాంగ్రెస్ ఆగ్రహం..

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (పిటిఐ):
కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘వోట్ చోరి’పై తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. నకిలీ ఓట్లు ఎలా వేయబడుతున్నాయో చూపించే వీడియోను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రజలను తమ హక్కులను కాపాడుకోవాలని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పట్టులో నుండి రాజ్యాంగ సంస్థలను విముక్తం చేయాలి” అని పిలుపునిచ్చారు.

మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ వీడియోను పంచుకుంటూ, “మీ ఓటు చోరీ అనేది మీ హక్కుల చోరీ, మీ గుర్తింపు చోరీ” అని అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, ఓటు దోపిడీని ఖండించారు. ఖర్గే మాట్లాడుతూ, “మీ ఓటు హక్కు దోపిడీకి గురి కాకుండా కాపాడుకోండి. ప్రశ్నించండి, సమాధానాలు కోరండి, ఈసారి వోట్ చోరికి వ్యతిరేకంగా స్వరం వినిపించండి” అని పిలుపునిచ్చారు.

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T170554.426.wav?_=9

ఆనంద్ కుమార్ తల్లోజు ఆచారికి క్షమాపణ చెప్పాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో…
మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో…
కౌన్సిలర్ గా ఓటమి…
ఎంపీటీసీ గా ఓటమి…
సర్పంచ్ గా ఓటమి…
కాటన్ మిల్లు ఓటమి…
100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…?
మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు
రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు
మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు
నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు
ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు
ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన
తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…?
నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా
ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…?
తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..?
బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…?
ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…?
బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…?
ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు.
తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..?
ప్రతి మహిళకు నెల నెల
2500/-రూ ” ఇస్తాం అనలేదా..?
ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..?
ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..?
ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…?
RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…?
నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ
కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం..

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం
*స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్
*బీసీల రిజర్వేషన్లు అడ్డుపెట్టుకొని ఎన్నికల ను ఆపుతుంది
*భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T140158.692.wav?_=10

వర్ధన్నపేట (నేటిధాత్రి):

బీసీ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుకనే ఆర్డినెన్స్లు ఉత్తర్వుల పేర్లతో కాలయాపన చేస్తుంది తప్ప రిజర్వేషన్లను అమలు చేసే చిత్తశుద్ధి లేక బీసీలను మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ గారికి పంపేటప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందదని తెలిసి కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బదనానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలను ఆలస్యం చేయడం కోసం మరియు దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికలను మరింత ఆలస్యం చేసి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప బీసీల అధికారంలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని సతీష్ అన్నారు. బీసీలకు అధికారం ఇచ్చే ఆలోచనకాంగ్రెస్ పార్టీ ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేయాలని మరియు రాష్ట్ర మంత్రివర్గంలో పదిమంది బిసి మంత్రులను తీసుకోవాలని కానీ అటువంటి పని చేపట్టని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై కపట నాటకం ఆడుతుందని వారి పార్టీలో మరియు ప్రభుత్వ పదవుల్లో 42% కేటాయించి వారి చిత్తశుద్ధి చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీని జడ సతీష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితిలో బీసీలు లేరని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తాం రాష్ట్రపతిని కలుస్తాం అనే మాటలు మానుకొని బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్లు కల్పించే పనిపై దృష్టి పెట్టి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version