న్యాయదేవత దుఃఖిస్తోంది: సీఎం మమతా బెనర్జీ…

న్యాయదేవత దుఃఖిస్తోంది: సీఎం మమతా బెనర్జీ

 

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తలుపుల వెనుక న్యాయ దేవత దుఃఖిస్తోంది’ అని అన్నారు. సుప్రీంకోర్టులో అయినా తమకు న్యాయం జరగాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు మమత.
పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ, మోస్తారీ బాను, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తన పిటిషన్‌పై స్వయంగా వాదనలు వినిపించిన సీఎం మమతా బెనర్జీ.. ఎన్నికల సంఘాన్ని ‘వాట్సాప్ కమిషన్’గా అభివర్ణించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు చూపించినా ఎస్ఐఆర్ అధికారులు అంగీకరించడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు.ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న అసోంలో కాకుండా.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్‌ను చేపడుతున్నారంటూ ఈసీ తీరుపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న అసోంలో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం లేదని ప్రశ్నించారామె. బీఎల్ఓలపై ఒత్తిడి తెచ్చి ఓట్లను తొలగిస్తున్నారని.. ఈ అంశంపై ఈసీకి ఆరుసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో బెంగాల్‌లో వంద మంది చనిపోయారన్నారు. సుప్రీంకోర్టులో అయినా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు సీఎం. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల హక్కులను కాపాడండి’ అని సీజేఐకి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. మమత అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఆ ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు..

ఆ ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు ?

రాజధాని నగరం చెన్నైలో 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

చెన్నై: చెన్నై జిల్లాలో సుమారు 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు సమాచారం. చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్‌ స్టేషన్‌ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి, పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో, లెక్కింపు ఫారాలు పొందే అంశంపై గురువారం స్థానిక రిప్పన్‌ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీఎంకే, ఎండీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం సహా 12 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ… చెన్నై(Chennai) జిల్లాలోని 40.04 లక్షల ఓటర్లలో 39.59 మందికి లెక్కింపు ఫారాలు అందజేశామన్నారు. వారిలో 22.79 లక్షల మంది నుంచి ఫారాలు పొందామని తెలిపారు. వారిలో 2.23 లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, 1.49 లక్షల మంది మృతిచెందిన జాబితాలో ఉన్నారని తెలిపారు.

బీహార్ ఓటర్ లిస్ట్ వివాదంపై కఠినంగా స్పందించిన ఎన్నికల సంఘం..

బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.
ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ – “ఎన్నికల దోపిడీ ఆరోపణలు భారత రాజ్యాంగానికి అవమానం” అని హెచ్చరించారు.

అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకే ఓటర్ల జాబితాలో మార్పులు చేయడానికి SIR చేపట్టామని ఆయన తెలిపారు. మొత్తం 1.6 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీల ప్రతినిధులు కలిసి డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేశారని స్పష్టం చేశారు.

“గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి హానికరం” అని గ్యానేశ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version