బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం
*స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్
*బీసీల రిజర్వేషన్లు అడ్డుపెట్టుకొని ఎన్నికల ను ఆపుతుంది
*భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్
వర్ధన్నపేట (నేటిధాత్రి):
బీసీ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుకనే ఆర్డినెన్స్లు ఉత్తర్వుల పేర్లతో కాలయాపన చేస్తుంది తప్ప రిజర్వేషన్లను అమలు చేసే చిత్తశుద్ధి లేక బీసీలను మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ గారికి పంపేటప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందదని తెలిసి కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బదనానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలను ఆలస్యం చేయడం కోసం మరియు దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికలను మరింత ఆలస్యం చేసి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప బీసీల అధికారంలో కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని సతీష్ అన్నారు. బీసీలకు అధికారం ఇచ్చే ఆలోచనకాంగ్రెస్ పార్టీ ఉంటే బీసీని ముఖ్యమంత్రి చేయాలని మరియు రాష్ట్ర మంత్రివర్గంలో పదిమంది బిసి మంత్రులను తీసుకోవాలని కానీ అటువంటి పని చేపట్టని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై కపట నాటకం ఆడుతుందని వారి పార్టీలో మరియు ప్రభుత్వ పదవుల్లో 42% కేటాయించి వారి చిత్తశుద్ధి చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీని జడ సతీష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితిలో బీసీలు లేరని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తాం రాష్ట్రపతిని కలుస్తాం అనే మాటలు మానుకొని బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్లు కల్పించే పనిపై దృష్టి పెట్టి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.