వైభవంగా ముగ్గుల రంగవల్లి పోటీలు

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల రంగవల్లి పోటీలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దంపతులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి పండుగ వెనుక గొప్ప పరిమార్తం ఉందని సంక్రాంతి రైతుల పండుగని నాగర్ కర్నూల్ నియోజవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగవల్లిలో ప్రతిభ చూపిన మహిళలకు అభినందనలు తెలిపారు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మండపల్లిలో ఘనంగా కాట్రేగుల సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కాట్రేగుల పలు కార్యక్రమాల సంబరాలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా కాట్రేగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గ్రామంలోని రాములవారి గుట్ట వద్ద రైతులు పశువులను దైవంగా భావించి పూజించి అంతరించిపోతున్న సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించే సందర్భంలో పశువులకు .జాజు.నూనె రాసి కాట్రేగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శీతాకాలంలో పశువులకు వచ్చే గాలి కుట్టు వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మంటల వేడి మరియు పొగ పశువుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని రైతులు నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద పెద్ద ఎత్తున సంక్రాంతి పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారని అలాగే గ్రామంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని. M.P.L. క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్న సందర్భంగా క్రికెట్ టీం లకు లక్కీ ఈవెంట్స్.. టాటా. AIG. హెల్త్ ఇన్సూరెన్స్ వారు క్రికెట్ టీం సభ్యులకు .టీషర్ట్లు అందించడం జరిగింది. దీనికి సూపర్ అసిస్టెంట్ గుర్రం నవీన్ టీ షర్ట్లు అందించడం జరిగింది ఇట్టి.సంక్రాత్రి సంబరాలకు గ్రామంలోని యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఉప సర్పంచ్ యాస సందీప్. వార్డు మెంబర్లు. అమర గోoడప్రభుదాస్. మూర్తి .మైపాల్రెడ్డి. రాయి పెళ్లి కృష్ణారెడ్డి. ఆసాని మహిపాల్ రెడ్డి..కరోబార్ దుర్మట్లలచ్చిరెడ్డి. హరికృష్ణ. కోమ్మటదేవయ్య. దాసరి దేవయ్య. కుల మల్లేశం. రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి: మోటే ధర్మారావు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమైందని ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతులు దింపాలని సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని ఈ ఏడాది పొడుగునా ఇంటింటా సిరులు కాంతులు విరిసిల్లాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

భూపాలపల్లిలో ఘనంగా భోగి సంబరాలు

భూపాలపల్లిలో భోగి మంటలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి భోగి పర్వదినం సందర్భంగా భోగిమంటలు వేసి భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ఆనందోత్సవంలో నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముంగిళ్లలో రంగువల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. రేగుపళ్లు, నవధాన్యాలు కలిపిన నీటితో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకల్లో మునిగితేలారు. ఈ పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్

భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్

గాలిపటాలు ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

పండుగల ద్వారానే కుటుంబాల అనుబంధాలు మరింత బలపడతాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ భూపాలపల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం జంగేడు – భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ టీషర్ట్ ఆవిష్కరించారు.

 

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు

శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తూ సంక్రాంతి సంబరాలు…

శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తూ సంక్రాంతి సంబరాలు

రైతు దంపతులకు ఘన సన్మానం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 01లో ముందస్తూ సంక్రాంతి సంబరాలు స్కూలు యాజమాన్యం ఘనంగా చేపట్టారు.గ్రామీణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించేలా శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏజీఎం అరవింద రెడ్డి విద్యార్థులకు మన పండుగల విశిష్టతను,రైతు ప్రాముఖ్యతను తెలిపాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు ఏర్పాటు చేయడం అబినందనీయమని తెలిపారు.సంక్రాంతి పండుగ మన సంస్కృతిలో అందర్భగమని,పంట చేతికొచ్చిన వేళ రైతు జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు.విద్యార్థులు కోలాహాలంతో స్కూల్ ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.సమాజానికి వెన్నెముకైన రైతు దంపతులను గౌరవించుకోవడం పండగ వేడుకల్లో విశేషంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్,హైస్కూల్ కో–ఆర్డినేటర్ నాగరాజు,ప్రైమరీ కో–ఆర్డినేటర్స్ జయశ్రీ,రోజా, ప్రైమరీ ప్రిన్సిపల్ స్రవంతి,ఎఓ విలాస్,ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version