జాతీయ మెగా లోక్-అదాలత్ లో 353 కేసుల రాజీ…

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 353 కేసుల రాజీ

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ మెగా లోక్-అదాలత్ కార్యక్రమంలో భాగంగా, భూపాలపల్లి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ పడదగిన కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, తెలిపారు
ఐపీసీ బిఎన్ ఎస్ కేసులు 232
సైబర్ క్రైమ్ కేసులు – 24
డీడీ & ఎంవీ యాక్ట్ కేసులు 96 ఈ-పెట్టి కేసులు – 01
మొత్తం – 353 కేసులు
ఈ కేసుల్లో ఇరు వర్గాలను సమన్వయం చేసి రాజీ కుదిర్చి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయడం లోక్-అదాలత్ ముఖ్య ఫలితంగా నిలిచింది. 24 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 1,61,441/- మొత్తాన్ని బాధితుల ఖాతాల్లో జమ చేయుటకు సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపడం జరిగింది. ఇది బాధితులకు గొప్ప ఉపశమనంగా మారింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మాట్లాడుతూ,
లోక్-అదాలత్ అనేది క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. చిన్న చిన్న గొడవలు, వివాదాలు కోర్టుల్లో సంవత్సరాల పాటు కొనసాగకుండా, ఇరు వర్గాలు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. “రాజీ మార్గమే రాజమార్గం” అనే భావన ప్రతి ఒక్కరికి ఉండాలని సూచించారు.

ఈ లోక్-అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, సైబర్ క్రైమ్ యూనిట్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

లోక్-అదాలత్ వంటి వేదికలు సమాజంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషిస్తాయని, ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి…

అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ కే ఓటేయాలి : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* అలియాబాద్ మున్సిపల్ లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున సోమవారం మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇంటి ఇంటి కి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని ఓటర్ లను కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు బండి లక్ష్మీ రాంరెడ్డి, తూము యమున శ్యామ్, తంటం నర్సింహా, సగ్గు శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, ముద్దం మధుసూదన్ రెడ్డి, బోయిన రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి…

ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు సైలెన్స్ డేగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
తెలిపారు. ఈ సమయంలో స్థానికేతరులు, ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, కాలనీలు వార్డుల్లో సంచరించరాదని సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version